Face Glow: రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క క్రీమ్ రాసినా...మీ ముఖం మెరిసిపోతుంది

Published : Nov 12, 2025, 04:35 PM IST

Face Glow: చలికాలంలో స్కిన్ డ్యామేజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చర్మం పగిలిపోతుంది. మాయిశ్చరైజర్ రాసినా కూడా ఫలితం లేదు అనుకునేవారు సహజంగా తయారు చేసుకున్న ఒక క్రీమ్ కచ్చితంగా రాయాల్సిందే. 

PREV
14
Night Cream

చలికాలం వచ్చింది అంటే చాలు మనందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ... ఈ కాలంలో చలిని తట్టుకోవడం కాస్త కష్టం. మరీ ముఖ్యంగా ఈ సీజన్ లో చర్మం చాలా ఎక్కువగా ప్రభావితమౌతుంది. చల్లని గాలులు, పొడి వాతావరణం, తక్కువ తేమ ఉండటం వల్ల... చర్మం తొందరగా పొడిబారుతుంది. ముఖంపై ముడతలు రావడం మొదలౌతాయి. నల్ల మచ్చలు కూడా కనపడొచ్చు. అందుకే... ఈ సమయంలో సరైన స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి.

మరీ ముఖ్యంగా నైట్ స్కిన్ కేర్ ఫాలో అవ్వాలి. దాని కోసం రాత్రిపూట సరైన క్రీమ్ ని అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం అందంగా మారుతుంది. యవ్వనంగా కూడా కనిపిస్తారు. మరి, ఆ నైట్ క్రీమ్ ని మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.....

24
నైట్ క్రీమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు...

2విటమిన్ ఈ క్యాప్సిల్స్, 4 చుక్కల ఆలివ్ ఆయిల్, 2 చుక్కల బాదం నూనె, 4 చుక్కల రోజ్మేరీ ఆయిల్, ఒక టీ స్పూన్ బొప్పాయి జెల్.

నైట్ క్రీమ్ తయారీ విధానం....

ముందుగా ఒక గాజు గిన్నెలో విటమిన్ ఈ క్యాప్సిల్స్ కట్ చేసి అందులోని ఆయిల్ పోయాలి. ఇప్పుడు అందులో ఆలివ్ ఆయిల్, బాదం నూనె చుక్కలు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రోజ్మేరీ ఆయిల్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. చివరగా బొప్పాయి గుజ్జు కూడా వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మీరు ఏదైనా గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకోవచ్చు.

34
ఈ క్రీమ్ వాడటం వల్ల ప్రయోజనాలు....

విటమిన్ ఈ చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. దీనిని రాయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుతాయి. చర్మానికి సహజంగా కాంతిని తెస్తుంది. ఆలివ్ ఆయిల్ చర్మానికి మంచి తేమ అందిస్తుంది. పొడి బారిన చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. బాదం నూనె చర్మ రంగును సమతుల్యం చేస్తుంది. నల్ల మచ్చలను తగ్గిస్తుంది. రోజ్మేరీ ఆయిల్ చర్మాన్ని శాంతింప చేస్తుంది. ఇన్ఫ్లమేషన్, ఇరిటేషన్ తగ్గిస్తుంది. చర్మానికి తేమ అందించి, చర్మానికి పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.

44
నైట్ క్రీమ్ వాడే విధానం...

రాత్రి పడుకునే ముందు ముఖాన్ని ముందుగా నీటితో శుభ్రం చేసుకోవాలి. టవల్ తో పూర్తిగా తేమ అంతా పోయేలా తుడుచుకోవాలి. ఆ తర్వాత తయారు చేసుకున్న క్రీమ్ ని నెమ్మదిగా ముఖానికి రాసి మునివేళ్ళతో మసాజ్ చేయాలి. క్రీమ్ చర్మంలోకి ఇంకిపోయే వరకు మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే.. ముఖం మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది. అయితే... ఈ క్రీమ్ ని ముఖానికి వాడే ముందు ప్యాచ్ టెస్టు చేసుకోవడం మర్చిపోవద్దు.

Read more Photos on
click me!

Recommended Stories