Beauty Tips: ఇంటి పనులు చేసి చేతులు పాడౌతున్నాయా? ఇవి రాస్తే చాలు..!

Published : Nov 12, 2025, 11:55 AM IST

 Beauty Tips: వయసు పెరుగుతుంటే ముఖం మీద ఎలా ముడతలు వస్తాయో చేతులపై కూడా ముడతలు పడతాయి. ఎక్కువ ఇంటి పనులు చేతులతోనే చేస్తాం కాబట్టి.. వాటిపై ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందుకే, వాటి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. 

PREV
15
Hands

ఇంటి పనులు, పిల్లలు, కుటుంబ బాధ్యతలు ఇవన్నీ నిర్వర్తిస్తూ చేతుల అందం కాపాడుకోవడం చాలా మందికి సవాలుగా మారింది అని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా రోజూ గిన్నెలు కడగడం వల్ల చేతులు తొందరగా పాడైపోతూ ఉంటాయి. మీరు కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నట్లయితే.... కేవలం కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వడం వల్ల మీ చేతులను మళ్లీ అందంగా మెరిసేలా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...

25
కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ వాడండి...

ఇంటి పనులు, ప్రత్యేకంగా పాత్రలు కడగడం లేదా నీటితో ఎక్కువసేపు పని చేయడం వల్ల చేతి చర్మం తరచుగా పొడిగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే.. రెగ్యులర్ గా చేతికి కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె రాస్తూ ఉండాలి. పాత్రలు కడిగిన గంట తర్వాత చేతులపై ఇలా నూనె రాయాలి. ఒక గంట పాటు చేతులను అలానే వదిలేయాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి తేమ అందుతుంది. పొడిబారే సమస్య కూడా తగ్గుతుంది. ముడతలు కూడా రావు.

35
రోజ్ వాటర్, గ్లిజరిన్....

రోజ్ వాటర్, గ్లిజరిన్ వాడటం వల్ల చేతులు సహజంగా అందంగా మారతాయి. ఈ రెండింటినీ సమానమైన పరిమాణంలో తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకు పూయాలి. ఇలా చేయడం వల్ల... చర్మం తేమగా ఉంటుంది. మృదువుగా కూడా మారుతుది. రాత్రిపూట రాసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.

45
కలబంద (అలోవెరా) జెల్ వాడండి

రాత్రి పడుకునే ముందు కలబంద జెల్‌ చేతులకు రాయాలి. ఇలా రాయడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. గాయాలు ఏమైనా ఉన్నా అవి కూడా తగ్గిపోతాయి. చేతులు చాలా మృదువుగా మారతాయి.

గ్లోవ్స్ ధరించండి...

పాత్రలు తోమేటప్పుడు, దుస్తులు ఉతికే సమయంలో వాడే డిటర్జెంట్లలో ఉన్న రసాయనాలు చర్మానికి చాలా హాని చేస్తాయి. కాబట్టి, పాత్రలు కడిగేటప్పుడు, దుస్తులు ఉతకడానికి ముందు హ్యాండ్ గ్లోవ్స్ ధరించడం మంచిది. ఇది చర్మాన్ని కాపాడటమే కాకుండా మీ చేతులను మృదువుగా మార్చడానికి కూడా సహాయపడుతుంది.

55
తేలికపాటి సబ్బు లేదా నేచురల్ డిటర్జెంట్ వాడండి

చేతి తొడుగులు ధరించడం కష్టంగా అనిపిస్తే, కెమికల్ ఫ్రీ సబ్బులు లేదా తేలికపాటి డిటర్జెంట్లు వాడండి. ఇవి చర్మానికి హానికరం కాకుండా పాత్రలను కూడా సులభంగా శుభ్రం చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories