Cracked Heels: పాదాలు పగిలి ఇబ్బంది పెడుతున్నారా? ఇవి రాస్తే చాలు

Published : Jul 11, 2025, 06:33 PM IST

పాదాలు పగిలి నడవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారా? మరి ఏం రాస్తే ఆ పగుళ్లు తగ్గుతాాయో తెలుసుకుందామా.. 

PREV
16
పాదాల పగుళ్లకు ఇలా చెక్ పెట్టండి...

పాదాల పగుళ్ల సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఎన్ని క్రీములు రాసినా కూడా తగ్గడం లేదా? అయితే.. కేవలం ఇంట్లో లభించే ఆలుగడ్డతో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని మీకు తెలుసా?  మీరు చదివింది నిజమే, బంగాళ దుంపలో సహజంగానే అనేక అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. 

బంగాళదుంపలో ఉండే పిండి పదార్థం.. పొడిబారిన, గరుకుగా మారిన పాదాలను మృదువుగా మార్చడానికి సహాయపడతాయి. ఇది చనిపోయిన చర్మకణాలను తొలగించి.. పాదాలను అందంగా మారుస్తుంది.

26
బంగాళ దుంప తురుము..

బంగాళ దుంపలోని కొన్ని సమ్మేళనాలు, పాదాల వాపు, చికాకు తగ్గించడంలో సహాయపడతాయి. ఇది పగుళ్ల వల్ల కలిగే నొప్పిని తగ్గిస్తుంది. ఇందులోని విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు, దెబ్బతిన్న చర్మాన్ని మరమ్మతు చేయడానికి సహాయపడతాయి. ఇది పగుళ్లను త్వరగా మూసివేయడానికి, చర్మంలోని మలినాలను తొలగించి, పాదాలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది.

ఇది పగిలిన పాదాలకు చాలా ప్రభావవంతమైన , సులభమైన పద్ధతి. బంగాళ దుంప  బాగా కడిగి, తొక్క తీయకుండా తురుముకోవాలి. తురిమిన ఆలుగడ్డ పగిలిన పాదాలపై, ముఖ్యంగా పగుళ్లు ఉన్న చోట ఉంచి, ఒక సన్నని, శుభ్రమైన వస్త్రంతో లేదా కాటన్ బ్యాండేజ్‌తో కట్టుకోవాలి. దీన్ని 20 నుండి 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో పాదాలను బాగా కడగాలి.

ఈ పద్ధతిని ప్రతిరోజూ ఒకసారి లేదా రోజు విడిచి రోజు చేస్తే, కొన్ని వారాల్లోనే మీ పాదాలు మృదువుగా మారతాయి.

36
బంగాళదుంప రసంతో నిమ్మరసం:

నిమ్మరసం చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి మెత్తని పేస్టులాగా చేసి దాని నుంచి రసం తీయాలి. ఈ రసంలో సగం నిమ్మకాయ రసం కలపాలి. ఈ మిశ్రమంలో దూది లేదా మృదువైన వస్త్రాన్ని ముంచి, పగిలిన పాదాలు , చుట్టుపక్కల ప్రాంతాల్లో రాసి 15 నుండి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత, పాదాలను చల్లటి నీటితో కడగాలి.

దీన్ని వారానికి 2-3 సార్లు చేయవచ్చు. నిమ్మరసం వాడటం వల్ల, పగటిపూట బయటకు వెళ్తే సన్‌స్క్రీన్ వాడటం లేదా రాత్రిపూట దీన్ని చేయడం మంచిది.

46
బంగాళదుంప పేస్ట్ , కొబ్బరి నూనె :

ఇది పాదాలకు లోతైన తేమను అందిస్తుంది. ఒక బంగాళదుంప ను ఉడికించి, తొక్క తీసి, ముద్దలా చేసుకోవాలి. దీనికి ఒక టీస్పూన్ శుభ్రమైన కొబ్బరి నూనె కలిపి మెత్తగా పేస్ట్‌లా కలపాలి. ఈ పేస్ట్‌ను పగిలిన పాదాలపై బాగా రాసి, 30 నిమిషాల నుండి ఒక గంట వరకు అలాగే ఉంచాలి. తర్వాత, గోరువెచ్చని నీటితో పాదాలను మెల్లగా రుద్ది కడగాలి.

దీన్ని ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు చేయవచ్చు. కొబ్బరి నూనె పాదాలకు రాత్రంతా తేమను అందించి, పగుళ్లను త్వరగా నయం చేయడానికి సహాయపడుతుంది.

56
బంగాళదుంప ఉడికించిన నీరు:

బంగాళదుంపను ఉడికించిన తర్వాత, ఆ నీటిని వృధా చేయకుండా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకుని, అది గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఆ తర్వాత, పాదాలను ఈ నీటిలో 15 నుండి 20 నిమిషాలు నానబెట్టాలి. ఇది పాదాలను మృదువుగా చేసి, పొడిబారడాన్ని తగ్గిస్తుంది. దీన్ని వారానికి 3-4 సార్లు చేయవచ్చు.

66
కొన్ని అదనపు చిట్కాలు:

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు, మీ పాదాలను గోరువెచ్చని నీటితో కడిగి, ఆరబెట్టి, మంచి నాణ్యమైన  క్రీమ్ (Foot Cream) లేదా మాయిశ్చరైజర్ రాసి మెల్లగా మసాజ్ చేయాలి. ఆలివ్ ఆయిల్ లేదా కాస్టర్ ఆయిల్ వంటి సహజ నూనెలను కూడా వాడవచ్చు.

బాగా సరిపోయే, సౌకర్యవంతమైన, మృదువైన చెప్పులను ధరించాలి. బిగుతుగా లేదా గరుకుగా ఉండే చెప్పులను ధరించకపోవడం మంచిది. ఇంట్లో నడిచేటప్పుడు కూడా మృదువైన చెప్పులను ధరించడం మంచిది. పాదాలను ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఫంగస్ , బాక్టీరియా ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

ఈ సులభమైన, సహజమైన బంగాళదుంప చిట్కాలు , కొన్ని జీవనశైలి మార్పుల ద్వారా, మీ పగిలిన పాదాలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఓపికగా క్రమం తప్పకుండా చేస్తే, మీ పాదాలు మళ్ళీ పట్టులా అందంగా, మృదువుగా మారతాయి.

Read more Photos on
click me!

Recommended Stories