మెరిసే చర్మం కోసం...
చలికాలంలో పొడి చర్మం సమస్యతో బాధపడుతున్నవారు ఈ బంతి పూల ఫేస్ ప్యాక్ తో చెక్ పెట్టొచ్చు. దీని కోసం... బాదం నూనె, బంతిపూలు ఉంటే చాలు. ముందుగా గాజు సీసాలో బాదం నూనె పోయాలి. ఈ నూనెలో బంతి పూల రెక్కలను వేసి మునిగేలా వేయాలి. ఈ మిశ్రమాన్ని సుమారు 15 రోజుల పాటు నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల.. ఆ నూనెలో బంతి పువ్వు రసం బాగా దిగుతుంది. తర్వాత ఈ నూనెను ఓ వస్త్రంతో దీనిని వడగొట్టాలి. ఈ నూనెను ప్రతిరోజూ ముఖానికి రాత్రి పడుకునే ముందు ఈ నూనెను రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల పొడి చర్మం సమస్య ఉండదు. ముఖం మృదువుగా మారుతుంది.