జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఆయిల్ మసాజ్ తప్పనిసరి. ఈ కాలం అమ్మాయిలు అసలు తలకు నూనె రాసుకోవడమే ఇష్టపడటం లేదు. కానీ.. రోజూ నూనె రాయకపోయినా కేవలం తలస్నానం చేయడానికి ముందు రాసుకున్నా చాలు. దానితో మసాజ్ చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.వారానికి కనీసం మూడు సార్లు.. కొబ్బరి నూనెలో ఆముదం కలిపి తలకు మసాజ్ చేయాలి. అది కూడా ఆ నూనెను గోరు వెచ్చగా నూనె వేడి చేసి.. తర్వాత దానిని తలకు మంచిగా మసాజ్ చేయాలి. రాత్రంతా అలానే వదిలేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే సరిపోతుంది.ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.
మీరు ఎంచుకునే షాంపూ విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. సల్ఫేట్, పారాబేన్ లేని షాంపూని ఉపయోగించండి. తలస్నానం చేసేటప్పుడు వేడి నీరు వాడకూడదు. దాని వల్ల జుట్టు పొడి బారి బలహీనపడుతుంది. మీరు మీ జుట్టు పాడవ్వకూడదు అంటే.. చల్లటి నీరు లేదంటే గోరు వెచ్చని నీరు వాడాలి. మీ జుట్టును మృదువుగా మార్చుకోవడానికి ప్రతిసారీ కండిషనర్ వాడాలి.సరైన జుట్టు సంరక్షణతో పాటు, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారం ,హైడ్రేషన్ మీ మొత్తం శరీరానికి ,మీ జుట్టుకు చాలా ముఖ్యం.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?
గుడ్లు, చిక్కుళ్ళు, గింజలు, సోయా ,పాలు వంటి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను తినండి.
ఐరన్ ,బయోటిన్ కోసం ఆకుకూరలు, క్యారెట్లు ,పండ్లను తినండి.
రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు త్రాగండి ,జంక్ ఫుడ్ మానుకోండి.
hair growth
హెయిర్ మాస్క్ ఎలా అప్లై చేయాలి..?
వారానికి ఒకటి లేదా రెండుసార్లు హెయిర్ మాస్క్ వాడటం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ,బలంగా ఉంటుంది.మెంతి పొడి + పెరుగు + కలబంద జెల్ కలిపి హెయిర్ మాస్క్ తయారు చేసుకోండి.30 నిమిషాలు అలాగే ఉంచండి, తర్వాత కడిగేయండి.
ఇది జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది.సహజమైన మెరుపును తెస్తుంది.
యాపిల్ సైడర్ వెనిగర్ హెయిర్ మాస్క్
మీ జుట్టు పొడిబారే అవకాశం ఉంటే, తేనె, గుడ్డు ,ఆపిల్ సైడర్ వెనిగర్ మాస్క్‌ను ప్రయత్నించండి. ఈ మాస్క్ జుట్టుకు మెరుపును జోడించడమే కాకుండా అద్భుతమైన పోషణను అందించే అద్భుతమైన మాయిశ్చరైజింగ్ ట్రీట్‌మెంట్ అని నమ్ముతారు.
hair growth
హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలి?
2 టీస్పూన్ల తేనె, 1 గుడ్డులోని తెల్లసొన ,1 టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ హెయిర్ మాస్క్‌ను మీ తలపై అప్లై చేసి 30 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ఇది మీ జుట్టుపై ప్రభావవంతంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్క ,కొబ్బరి నూనె హెయిర్ మాస్క్
దాల్చిన చెక్క ,కొబ్బరి నూనె హెయిర్ మాస్క్. దాల్చిన చెక్క ఆహారం ,ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ జుట్టు పెరగడం లేదని మీకు అనిపిస్తే.. మీరు దాల్చిన చెక్క నూనె వాడొచ్చు. లేదంటే.. ఈ హెయిర్ మాస్క్ తయారు చేసుకొని, జుట్టుకు అప్లై చేస్తే చాలు. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది.
హెయిర్ మాస్క్‌ను ఎలా ఉపయోగించాలి?
కొబ్బరి నూనెతో దాల్చిన చెక్క పొడిని కలపండి. తయారుచేసిన మిశ్రమాన్ని మీ చేతివేళ్లను ఉపయోగించి మీ జుట్టు ,తలపై మసాజ్ చేయండి. ఈ హెయిర్ ప్యాక్‌ను 30 నుండి 45 నిమిషాలు అలాగే ఉంచి శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. కనీసం వారానికి ఒకసారి ఈ హెయిర్ ప్యాక్‌ను ఉపయోగించండి. కనీసం నెల రోజుల పాటు ఇలా చేస్తే, కచ్చితంగా జుట్టు రాలడం తగ్గి, మళ్లీ ఒత్తుగా పెరుగుతుంది.