
ఈ రోజుల్లో జుట్టు రాలే సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. ఎంత ఖరీదైన నూనెలు, షాంపూలు వాడినా కూడా తమ జుట్టు రాలడం ఆగడం లేదని చాలా మంది వాపోతూ ఉంటారు. అయితే.. ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండానే, ఇంటి చిట్కాలతోనే జుట్టు రాలడం తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడం తగ్గడం మాత్రమే కాదు,మళ్లీ కొత్త జుట్టు కూడా పెరుగుతుంది. మరి దాని కోసం జుట్టుకు ఏం రాయాలో తెలుసుకుందాం..
మనకు సులభంగా లభించే మూడు రకాల నూనెలను జుట్టుకు రాయడం వల్ల అసలు జుట్టు రాలదట. ఆ మూడు నూనెలు మరేంటో కాదు.. కొబ్బరి నూనె, ఆముదం నూనె, రోజ్మేరీ నూనె. ఈ మూడు నూనెలను సమపాళ్లలో తీసుకొని, బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసి, చక్కగా మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన తర్వాత 1 నుంచి 2 గంటలు వదిలేయాలి. ఆ తర్వాత ఘాడత తక్కువ ఉన్న షాంపూ తో తలస్నానం చేస్తే సరిపోతుంది.
ఈ మూడు నూనెల ప్రయోజనాలు..
కొబ్బరి నూనె: జుట్టుకు తేమను అందించి, ఇరిగిపోకుండా కాపాడుతుంది.
ఆముదం నూనె: జుట్టు కుదుళ్లను బలపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
రోజ్మేరీ నూనె: జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది, కొత్త జుట్టు మొలకెత్తేందుకు సహాయపడుతుంది.
ఈ నూనెతో పాటు జుట్టు పెరుగుదలకు ఉపయోగపడే కొన్ని హోం రెమిడీలు..
ఉల్లిపాయ రసం తలకు రాసుకుంటే జుట్టు కుదుళ్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది, జుట్టు బలపడుతుంది.
కలబంద జెల్ తేమను అందించి, పొడి జుట్టును సున్నితంగా ఉంచుతుంది.
మెంతి గింజలు నానబెట్టి పేస్ట్ చేసి తలకు రాస్తే జుట్టు రాలడాన్ని తగ్గించి, కొత్త జుట్టు పెరుగుతుందనే నమ్మకం ఉంది.
ఉసిరి రసం లేదా ఉసిరి నూనె విటమిన్ సి అందించి, జుట్టుకు సహజమైన మెరుపుని ఇస్తుంది.
వారానికి ఒకసారి గుడ్డు మాస్క్ వాడటం వల్ల జుట్టు బలంగా, మృదువుగా మారుతుంది.
ఆహారంలో కూడా ప్రోటీన్, ఐరన్, బైటిన్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారాలను చేర్చడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. దినసరి నీటి సేవనాన్ని పెంచడం ద్వారా జుట్టుకు తేమ అందుతుంది.
జుట్టు పెరగాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు...
1. గుడ్లు (Eggs)
గుడ్లలో ప్రోటీన్, బయోటిన్ అధికంగా ఉంటుంది. ఇవి జుట్టు కుదుళ్లను బలపరిచి కొత్త జుట్టు పెరగడానికి సహాయపడతాయి.
2. ఉల్లిపాయలు (Onions)
ఉల్లిపాయల్లో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది, ఇది జుట్టు కుదుళ్ల రక్త ప్రసరణను మెరుగుపరచి జుట్టు వృద్ధికి తోడ్పడుతుంది.
3. పాలకూర (Spinach)
ఐరన్, విటమిన్ A, C లతో సంపన్నమైన పాలకూర జుట్టుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తహీనత వల్ల వచ్చే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
4. శెనగలు (Chickpeas)
ప్రోటీన్, ఐరన్, జింక్ తక్కువ ఖర్చుతో లభించే మటుల్లో పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు దృఢంగా ఉండేందుకు సహాయపడతాయి.
5. నారింజలు (Oranges)
విటమిన్ C అధికంగా ఉండే నారింజలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అవి కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి.
6. బాదంపప్పు, వాల్నట్స్ (Almonds, Walnuts)
ఒమెగా-3 ఫ్యాటి యాసిడ్స్, బయోటిన్ లాంటి పోషకాలు ఉన్న బాదంపప్పు, వాల్నట్స్ జుట్టు మెరుపుని, బలాన్ని పెంచుతాయి.
7. ముదురు ఆకుపచ్చ కూరగాయలు (Dark Leafy Greens)
పాలకూర, తోట కూర వంటి ఆకుకూరలు జుట్టుకు అవసరమైన విటమిన్ E, ఐరన్ వంటి పోషకాలను అందిస్తాయి.
8. అవకాడో (Avocado)
విటమిన్ E, ఒమెగా-3 లతో నిండిన అవకాడో జుట్టుకు తేమను అందించి, మృదుత్వాన్ని పెంచుతుంది.
9. గ్రీక్ యోగర్ట్ (Greek Yogurt)
ప్రోటీన్‌తో పాటు జుట్టు పెరుగుదల కోసం అవసరమైన విటమిన్ B5 కూడా గ్రీక్ యోగర్ట్‌లో ఉంది.
10. గోధుమ రవ్వ, ఓట్స్ (Whole Grains, Oats)
బయోటిన్, ఐరన్, జింక్ లాంటి ఖనిజాలు గోధుమలలో లభిస్తాయి. ఇవి జుట్టు ఒరిగిపోవడం, నాజూకు జుట్టు సమస్యలను తగ్గిస్తాయి.