Period Beliefs: పీరియడ్స్ గురించి ఏ దేశంలో ఎలాంటి నమ్మకాలున్నాయో తెలుసా?

Published : Mar 27, 2025, 02:34 PM IST

పీరియడ్స్ అనేది మహిళల్లో సాధారణ ప్రక్రియ. దీని గురించి చాలా మందికి చాలా రకాల అపోహలు, మూఢనమ్మకాలు ఉంటాయి. పీరియడ్స్ వస్తే ఇది చేయకూడదు, అది చేయకూడదు, ఎవరిని ముట్టుకోకూడదు లాంటి చాలా నమ్మకాలు ఉంటాయి. మన దేశంలోనే కాదు.. విదేశాల్లో కూడా పీరియడ్స్ గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
18
Period Beliefs: పీరియడ్స్ గురించి ఏ దేశంలో ఎలాంటి నమ్మకాలున్నాయో తెలుసా?

నెలసరి.. మహిళల జీవితంలో సహజమైన ప్రక్రియ. అయితే పీరియడ్స్ గురించి ఇప్పటికీ చాలామందిలో కొన్ని నమ్మకాలు ఉన్నాయి. పీరియడ్స్ వస్తే వంటగదిలోకి వెళ్లద్దు. కొత్త బట్టలు ముట్టుకోవద్దు. పూజ చేయద్దు ఇలా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. అయితే ఇవి ఇండియాలోనే కాదు. వేరే దేశాల్లో కూడా ఉన్నాయట. అవెంటో ఇక్కడ తెలుసుకుందాం.

28
అమెరికాలో పీరియడ్స్ గురించి నమ్మకాలు!

అమెరికాలో పీరియడ్స్ గురించి రకరకాల నమ్మకాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో మహిళలు స్నానం చేయకూడదట. దీనివల్ల ఆడవారిలో కొన్నిరకాల ఇబ్బందులు వస్తాయని వారు అపవిత్రులవుతారని ఇక్కడ నమ్ముతారు.

38
ఇజ్రాయిల్లో పీరియడ్స్ నమ్మకాలు?

పీరియడ్స్ గురించి ఇజ్రాయిల్లో వింత నమ్మకం ఉంది. ఇక్కడ కొంతమంది అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చిన మొదటి రోజున చెంప మీద కొడతారు. దీనివల్ల జీవితాంతం చెంప ఎర్రగా ఉంటుందని వారి నమ్మకం.

48
భారత దేశంలో పీరియడ్స్ గురించి నమ్మకాలు?

భారతదేశంలో పీరియడ్స్ గురించి చాలా నమ్మకాలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో మహిళలను గుడిలోకి వెళ్లనివ్వరు. కిచెన్ లోకి కూడా వెళ్లనివ్వరు. ఈ సమయంలో ఆమెను అపవిత్రురాలుగా చూస్తారు.

58
మలేషియాలో నమ్మకాలు

మలేషియాలో పీరియడ్స్ లో వాడిన ప్యాడ్ లను కడిగి పారేయాలి. లేదంటే దెయ్యం పడుతుంది అని నమ్ముతారు. అందుకే అక్కడ ప్యాడ్ కడిగి పారేస్తారట.

68
ఫ్రాన్స్

ఫ్రాన్స్ లో పీరియడ్స్ సమయంలో ఆడపిల్లలు మయోనైస్ చేయకూడదట. ఎందుకంటే ఈ సమయంలో వాళ్లు మయోనైస్ చేస్తే అది గడ్డకట్టి పాడైపోతుందని అక్కడి వారు నమ్ముతారు.

78
బ్రెజిల్

బ్రెజిల్ లో పీరియడ్స్ సమయంలో చెప్పులు లేకుండా నడవకూడదట. అలా నడిస్తే భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ, పిల్లల విషయంలో కొన్ని సమస్యలు వస్తాయని అక్కడివారు నమ్ముతారు.

88
ఫిలిప్పీన్స్

ఫిలిప్పీన్స్ లో చిన్న అమ్మాయిలకు వాళ్ల పీరియడ్స్ బ్లెడ్ తో ముఖం కడుక్కోమని చెప్తారట. దీనివల్ల ముఖం మీద మచ్చలు పోతాయి అని అక్కడి వారు నమ్ముతారు.

Read more Photos on
click me!

Recommended Stories