హెయిర్ మాస్క్ వేసిన తర్వాత జుట్టును ఎలా కడగాలి?
ఈ హెయిర్ ప్యాక్ ఎండిపోయిన తర్వాత, తేలికపాటి షాంపూతో కడగాలి. ఈ హెయిర్ ప్యాక్ మెరుగైన ఫలితాలను చూడటానికి, వారానికి కనీసం రెండుసార్లు అప్లై చేయండి. దీన్ని రెండుసార్లు అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.
మీకు మృదువైన, మెరిసే జుట్టు కావాలంటే, మీరు కలబంద , మెంతుల పొడి కలిపిన కొబ్బరి నూనెను అప్లై చేయవచ్చు. ఈ మాస్క్ జుట్టు లోపలి నుండి పోషణకు సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో తేమ పుష్కలంగా ఉంటుంది, ఇది జుట్టుకు పోషణను అందిస్తుంది. దీనితో పాటు, ఇది జుట్టు కుదుళ్లు బలపడటమే కాకుండా జుట్టు చిట్లిపోవడం తగ్గిస్తుంది. మెంతులలో ఫైటోఈస్ట్రోజెన్‌లు ఉంటాయి. కలబంద జెల్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది జుట్టును అందంగా, ఆరోగ్యంగా మారుస్తుంది.