దక్షిణాదిన టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న హీరోయిన్లలో నయనతార ఒకరు. ఏదైనా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేయాలన్నా... డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలన్నా.. ముందుగా గుర్తుకు వచ్చేది నయనతార. ఆమె భిన్న కాన్సెప్ట్ సినిమాలతో ఆమె అదగరొడుతున్నారు.
నయనతార సినిమాల్లోకి అడుగుపెట్టి దాదాపు 15 సంవత్సరాలు దాటింది. అప్పటి తో పోలిస్తే.. ఇప్పుడు ఆమె మరింత అందంగా కనిపిస్తున్నారు. ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన ఆమె.. ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఆమె ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. అదే విధంగా ఆహారం విషయంలోనూ అంతే జాగ్రత్తలు తీసుకుంటారు. ఆమె ఆరోగ్యంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ డైట్ ని ఫాలో అవుతూ ఉంటారు.
ఆమె బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఓ డ్రింక్... ఆమె ఆరోగ్యానికి , అందానికి కారణమట. ప్రతిరోజూ నయన తార కొబ్బరితో తయారు చేసిన స్మూతీని బ్రేక్ ఫాస్ట్ డ్రింక్ గా తీసుకుంటారట. ఆ డ్రింక్ ఆమెను ఆరోగ్యంగా, అందంగా ఉండటానికి సహాయం చేస్తుంది.
ఈ కోకోనట్ స్మూతీ తయారు చేయడం ఎలాగో ఓసారి చూద్దాం... దీనిని తయారు చేయడానికి మనకు రెండు కప్పుల కొబ్బరి నీళ్లు, ఒక కప్పు కొబ్బరి తురుము, అరకప్పు కొబ్బరి పాలు, కొంచెం పంచదార, చిటికెడ్ దాల్చిన చెక్క పొడి వాడతారు.
ముందుగా బ్లెండర్ లో కొబ్బరి నీరు, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, పంచదార వేసి బాగా బ్లెండ్ చేయాలి. ఎలాంటి తొలకలు లేకుండా... మెత్తని పేస్టులాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఓ గ్లాస్ లోకి తీసుకోవాలి.
ఇప్పుడు అందులో దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. చల్ల చల్లగా తాగాలి అనుకుంటే.. అందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. లేదు అంటే.. వదిలేయవచ్చు.
ఈ కొబ్బరి స్మూతీ తాగడం వల్ల మన శరీరానికి ఫైబర్ అందుతుంది. అంతేకాకుండా.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది.. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మెటబాలిజం ను మెరుగుపరుస్తుంది. మనం ఆరోగ్యంగా ఉండటానికి సహాయం చేస్తుంది.