పెళ్లిలో వధువు ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటుంది..?

Published : Jul 25, 2022, 10:26 AM IST

చాలా మంది అమ్మాయిలు..చిన్న తనంలోనే చెవులతో పాటు ముక్కు కూడా కుట్టించుకుంటారు. అలా కుట్టించుకుంటే పర్వాలేదు కానీ.. ఒకవేళ కుట్టించుకోకుంటే.. పెళ్లి కుదిరిన వెంటనే ముక్కు పుడక కుట్టిస్తారట.

PREV
18
పెళ్లిలో వధువు ముక్కు పుడక ఎందుకు పెట్టుకుంటుంది..?
Image: Vikrant Massey/Instagram

భారత దేశం.. సాంప్రదాయానికి పెట్టింది పేరు. ముఖ్యంగా పెళ్లి విషయంలో మన దేశంలో చాలా రకాల సంప్రదాయాలను ఫాలో అవుతూ ఉంటారు. కొందరి సంప్రదాయం ప్రకారం.. వరుడు కేవలం గుర్రం మీద మాత్రమే మండపానికి రావడం, ఊరేగింపులో భారత్ నిర్వహించడం.. ఇలా చాలా రకాల సంప్రదాయాలు ఉంటాయి.

28
Anupama Gowda unique nose ring

ఇక చాలా మంది ఫాలో అయ్యే సంప్రదాయాల్లో ముఖ్యమైనది మరోటి ఏమిటంటే... పెళ్లిలో వధువు ముక్కు పుడక ధరించడం. మీరు గమనించే ఉంటారు.. దాదాపు దక్షిణాదిన జరిగే చాలా పెళ్లిళ్లలో వధువు ముక్కు పుడక ధరిస్తుంది.

38

చాలా మంది అమ్మాయిలు..చిన్న తనంలోనే చెవులతో పాటు ముక్కు కూడా కుట్టించుకుంటారు. అలా కుట్టించుకుంటే పర్వాలేదు కానీ.. ఒకవేళ కుట్టించుకోకుంటే.. పెళ్లి కుదిరిన వెంటనే ముక్కు పుడక కుట్టిస్తారట. అది కూడా ఒక సంప్రదాయమేనట. అసలు.. వధువు ముక్కు పుడక ఎందుకు ధరించాలి..? దాని వెనక ఉన్న కారణమేంటో ఓసారి చూద్దామా...

48
Wedding Trends-Is the Bride smiling a Wedding

ముక్కు పుడక అంటే మామూలు ముక్కు పుడక కాదట. పెళ్లికంటూ డిఫరెంట్ గా ముక్కు నుంచి చెవి వరకు కలిపి ఉంచే దానిని మాత్రమే పెట్టుకుంటారు.  హిందూ సంప్రదాయం ప్రకారం ఎవరైనా యువతి అలాంటిట  ముక్కు పడక ధరించింది అంటే... ఆమె పెళ్లి చేసుకుంటోందని అర్థమట. పెళ్లి తర్వాత మాత్రమే వారు అవి పెట్టుకుంటారట.

58

అంతేకాదు.. వధువు అలా ముక్కు పుడక ధరించడం వల్ల.. పార్వతీ దేవిని పూజిస్తూ, గౌరవిస్తున్నట్లు అర్థమట. అలా వధువు ధరించడం వల్ల.. ఆ నూతన వధువరులకు దేవత ఆశీర్వాదం దక్కడంతో పాటు.. వారికి అంతా అదృష్టం కలిసి వస్తుందని నమ్మకమట.

68

ఇక ఈ కాలం వధువులు ఈ పాత సంప్రదాయానికి అలంకరణ లో భాగంగా  ఈ ముక్కు పుడకను ధరిస్తూ వస్తున్నారట. ఆ ముక్కు పుడక వారిని అదనపు ఆకర్షణగా నిలుస్తుండట విశేషం.
 

78


ఇక.. కొందరికి కేవలం పెళ్లి ఒక్కరోజు కోసం ముక్కుకు రంధ్రం చేయించుకోవడం ఇష్టం ఉండదు. అలాంటివారు..  కేవలం ముక్కుకు నొక్కి పట్టి ఉంచేవి.. లేదంటే అతికించేవి.. ఇలా మార్కెట్లో లభించే భిన్నమైన ముక్కు పుడకలను ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా ముక్కుపుడక బరువైనది ధరించడం వల్ల.. నొప్పి, ఇబ్బంది ఉంటుంది కాబట్టి.. వాటిలోనూ తేలికగా అనిపించేవి కూడా మార్కెట్లో లభ్యమౌతున్నాయి.
 

88

ఇక ఈ కాలం వధువులు చాలా మంది..తమ పెళ్లి దుస్తులు, ధరించే నగలకు మ్యాచింగ్ అయ్యేలా కూడా ఈ ముక్కు  పుడకలను ఎంచుకుంటున్నారు.  ఇది ఇప్పుడు స్టేటస్ గా కూడా మారడం గమనార్హం.
 

Read more Photos on
click me!

Recommended Stories