మొన్నటి వరకు ఎండలు మండిపోయాయి. ఆ ఎండల తర్వాత వస్తున్న ఈ వర్షాలు కాస్త హాయిగానే అనిపిస్తాయి. మనకు కూడా హాయి ఫీలింగ్ కలుగుతుంది. దాదాపు వర్షం అంటే అందరికీ ఇష్టమే. అయితే... ఈ వర్షాకాలంలో మన అందాన్ని కాపాడుకోవడానికి మాత్రం చాలా తిప్పలే పడాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా జుట్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీరు గమనించారో లేదో.. వర్షాకాలం రాగానే జట్టు విపరీతంగా ఊడిపోతుంది. అధిక తేమ కారణంగా చాలా మందికి చుండ్రు సమస్య కూడా వస్తూ ఉంటుంది. అంతేకాదు.. జుట్టు నిర్జీవంగా...కళాకాంతి లేకుండా తయారౌతుంది. అందుకే.. వర్షాకాలంలో జుట్టు సంరక్షణ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే.. వర్షాకాలంలోనూ మన జట్టు అందంగా, ఆరోగ్యంగా ఉంటుందో ఓసారి చూద్దాం..
ఆరోగ్యకరమైన జుట్టు ఎప్పుడూ అందంగానే కనపడుతుంది. వాతావరణం కారణంగా జుట్టు పాడవ్వకుండా ఉండేందుకు తరచూ షాంపూ, కండిషనింగ్ చేయడం తప్పనిసరి. అయితే.. అక్కడితో ఆగకుండా.. జుట్టును సంరక్షించుకోవడానికి సీరమ్ లను కూడా ఉపయోగించడం ఉత్తమమైన మార్గం. అయితే.. వేసవి కాలంలో ఉపయోగించే ఉత్పత్తులు.. వర్షాకాలంలోనూ సెట్ అవుతాయి అనుకోవడం మాత్రం పొరపాటు. సీజన్ కి తగినవి ఉపయోగించాలి.
చాలా మంది వర్షాకాలంలో ఎక్కువగా వర్షంలో తడవడానికి ఇష్టపడతారు. అయితే... ఎక్కువగా వర్షంలో తడవడం వల్ల జుట్టు త్వరగా పాడౌతుందట. వర్షంలో తడిచినప్పుడు కాలుష్యం, ట్యాక్సిన్స్ జుట్టును త్వరగా పాడవ్వడానికి కారణమౌతాయి. కాబట్టి.. వర్షంలో తడవకుండేలా జాగ్రత్త తీసుకోవాలి. పొరపాటున తడిస్తే.. వెంటనే తలస్నానం చేయాలి. ప్రోటీన్, కెరాటిన్ పుష్కలంగా ఉండే షాంపూను ఎంచుకోవడం ఉత్తమం.
జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే దానికి పోషకాలు చాలా అవసరం. మరి జట్టుకు పోషకాలు అందాలి అంటే.. మనం క్రమం తప్పకుండా నూనె రాయాల్సి ఉంటుంది. వారానికి కనీసం రెండు సార్లు నూనె రాసి తలకు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆకృతి అంంగా ఉండటంతోపాటు.. పోషకాలు కూడా అంతుాయి.
ఆర్గానిక్ ఆయిల్, ఆమ్లా షీకాకై ఆయిల్ , బ్రింగ్ రాజ్ , ఆనియన్ హెయిర్ ఆయిల్ లాంటివి ఎంచుుకోవడం మంచిది. సరైన నూనెను ఎంచుకుంటూ జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. రాత్రిపూట ఆయిల్ రాసి ఉదయాన్నే తలస్నానం చేయవచ్చు. లేదంటే.. తలస్నానానికి రెండు గంటల ముందు నూనె రాసుకోవడం లాంటివి కూడా చేయవచ్చు. ఇలా చేస్తే జుట్టు మెరుస్తూ కనిపిస్తుంది.
ఇక జుట్టు ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. దాని కోసం కండిషనర్ వాడటం తప్పనిసరి. ముందు హెయిర్ ని శుభ్రంగా వాష్ చేసి.. తర్వాత కండిషనర్ ఉపయోగించండి. కండిషనర్ జుట్టును సహజ తేమను చెక్కుచెదరనివ్వకుండా కాపాడుతుంది. జుట్టు చిట్లిపోవడం లాంటి సమస్యను కూడా పరిష్కరిస్తుంది.
రెగ్యులర్ కండిషనింగ్‌తో పాటు, ఎప్పటికప్పుడు డీప్ కండిషనింగ్‌ను కూడా పాటించాలి. హెయిర్ మాస్క్ లేదా క్రీమ్ జుట్టుకు అదనపు మోతాదులో హైడ్రేషన్ ఇస్తుంది, అది మెరుస్తూ, మృదువుగా ఉండటానికి సహాయం చేస్తుంది.
మీ జుట్టును మరింత డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడానికి, మంచి హెయిర్ సీరమ్‌ను ఉపయోగించడం అలవాటు చేసుకోవాలి. హెయిర్ సీరమ్ వాడటం వల్ల జుట్టు మీద ఓ రక్షణ కవచంలా ఓ పొరను ఏర్పాటు చేస్తుంది.
అయితే.. అది జిడ్డుగా మాత్రం ఉండదు. కానీ.. జుట్టును రక్షిస్తుంది. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే.. వర్షాకాలంలో జుట్టును ఎలాంటి టెన్షన్ లేకుండా రక్షించుకోవచ్చు.