Face Glow: దీపావళి వేళ ఇదొక్కటి రాసినా, ముఖం మెరిసిపోవడం ఖాయం..!

Published : Oct 18, 2025, 12:12 PM IST

Face Glow: అందాన్ని పెంచుకోవడానికి ఖరీదైన క్రీములు, సీరమ్స్ వాడుతున్నారా? అయితే వాటితో అవసరం లేకుండా కూడా మీ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా? 

PREV
14
Beauty Tips

పండగ వేళ అందంగా మెరిసిపోవాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. అయితే.. అందంగా కనిపించాలంటే.. ముఖానికి మేకప్ వేయాల్సిన అవసరం లేదు. సహజంగా కూడా అందాన్ని పెంచుకోవచ్చు. ఈ దీపావళి పండగ రోజు చిన్న బీట్రూట్ ముక్క వాడి మీ ముఖాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...

24
బీట్రూట్ తో మెరిసే అందం..

బీట్రూట్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందనే విషయం స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే బీట్రూట్ ఒక్క రోజులో మన ముఖంలో గ్లో పెంచుకోవచ్చు. బీట్రూట్ లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఐరన్, ఫోలేట్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుంచి పోషించి ముఖానికి మెరుపు తీసుకువస్తాయి.

బీట్రూట్ ని డైరెక్ట్ గా ముఖానికి రుద్దే బదులు.. దానిని ఐస్ క్యూబ్స్ రూపంలో మార్చుకొని ముఖానికి అప్లై చేయాలి. బీట్రూట్ ని చిన్న ముక్కలుగా కట్ చేసి దానిని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. తర్వాత దానిని ఒక వస్త్రంలో వడకొట్టాలి. ఇప్పుడు ఈ రసానికి కొద్దిగా పాల మీగడ, కలబంద జెల్, తేనె కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్యూబ్ ట్రేలో పోసి.. రాత్రంతా వదిలేయాలి. ఉదయానికి గడ్డకడతాయి.

34
ఉపయోగించే విధానం

ఫ్రిజ్‌లో నుండి ఒక లేదా రెండు ఐస్ క్యూబ్స్ తీసుకొని మీ ముఖంపై వృత్తాకార కదలికలో సుమారు 2 నిమిషాలు మసాజ్ చేయండి. దీని వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఐస్ చల్లదనం రంధ్రాలను కుదిస్తుంది, ముఖం ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని, తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాయాలి.

44
కలిగే ప్రయోజనాలు

సహజ మెరుపు: బీట్‌రూట్‌లో ఉన్న బీటా కెరోటిన్, విటమిన్ C చర్మానికి సహజ కాంతిని అందిస్తాయి.

మచ్చలు తగ్గడం: క్రమం తప్పకుండా ఉపయోగిస్తే మొటిమల మచ్చలు, టాన్ తగ్గుతాయి.

యాంటీ ఏజింగ్ ప్రభావం: బీట్‌రూట్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ వృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తాయి.

సమతుల చర్మం: ఐస్ మసాజ్ వలన రంధ్రాలు మూసుకుపోవడం వల్ల చర్మం స్మూత్‌గా, ఫ్రెష్‌గా కనిపిస్తుంది.

తేమ సమతుల్యం: తేనె లేదా కలబంద జెల్ కలపడం వలన చర్మంలో తేమ నిలిచి పొడిబారడం తగ్గుతుంది.

ఈ బీట్‌రూట్ ఐస్ క్యూబ్స్‌ను ప్రతిరోజూ లేదా రెండు రోజులకొకసారి వాడవచ్చు. ఉదయం లేదా రాత్రి నిద్రకు ముందు ఉపయోగించడం ఉత్తమం. కొన్ని రోజుల ఉపయోగం తర్వాతే మీరు చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మారినట్టు గమనిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories