వాటర్ బాటిల్ ను లోపలి నుంచి ఎలా క్లీన్ చేయాలి?

First Published | Nov 1, 2024, 4:18 PM IST

ప్రతి ఒక్క ఇంట్లో వాటర్ బాటిల్స్ ఖచ్చితంగా ఉంటాయి. అలాగే వీటిని రెగ్యులర్ గా వాడుతుంటారు. కానీ ఈ వాటర్ బాటిల్ ను క్లీన్ చేయడం మాత్రం అంత సులువు కాదు. ముఖ్యంగా లోపలి నుంచి వీటిని క్లీన్ చేయడానికే కాదు. కానీ కొన్ని చిట్కాలతో లోపలి నుంచి కూడా క్లీన్ చేయొచ్చు. 

హెల్తీ ఫుడ్ ను తినడంతో పాటుగా ప్రతిరోజూ నీళ్లను కూడా పుష్కలంగా తాగాలి. నీళ్లే మన శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతాయి. మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. అందుకే ప్రతిరోజూ 8 నుంచి 10 గ్లాసుల నీటిని తాగాలని ఆరోగ్య నిపుణులు, డాక్టర్లు చెప్తుంటారు.

అయితే ప్రతి ఇంట్లో నీళ్లు తాగడానికి స్టీల్ గ్లాసుల కంటే.. వాటర్ బాటిళ్లనే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ వాటర్ బాటిల్ నీళ్లను తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఎన్నో రోగాలకు దారితీస్తుంది.

వాటర్ బాటిల్ ను ఎక్కువగా వాడితే మాత్రం దాన్ని బాగా శుభ్రం చేయాలి. అలాగే రెండు రోజులకోసారి ఎండలో ఆరబెట్టాలి. ఈ వాటర్ బాటిల్స్ ను సరిగ్గా శుభ్రం చేయకపోతే లోపల బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది మనల్ని ఎన్నో వ్యాధుల బారిన పడేస్తుంది. 

అయితే చాలా బాటిల్స్ ను క్లీన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆ బాటిల్స్ లోకి ఏది పట్టదు. ఇలాంటి వాటిని ఏం చేసినా క్లీన్ చేయలేం.కానీ కొన్ని స్మార్ట్ చిట్కాలతో ఈ బాటిళ్లను కూడా చాలా సులువుగా క్లీన్ చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Latest Videos


వాటర్ బాటిల్స్ ను సులభంగా శుభ్రం చేయడానికి చిట్కాలు:

వేడి నీళ్లు, బేకింగ్ సోడా

వేడి నీల్లు, బేకింగ్ సోడాతో కూడా చాలా సులువుగా మీరు బాటిల్స్ ను క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ఒక  వెడల్పాటి గిన్నెళ్లో వేడి నీళ్లు పోయండి. దీంట్లో బేకింగ్ సోడా, ఉప్పును వేసి కలపండి. ఇప్పుడు ఈ నీళ్లలో వాటర్ బాటిల్ ను వేసి10 నిమిషాల పాటు నానబెట్టండి. ఆ తర్వాత క్లినిక్ స్క్రబ్ తో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

వెనిగర్, వేడి నీళ్లు

వాటర్ బాటిల్స్ కు రకరకాల మరకలు కూడా అంటుకుంటుంటాయి. ఇవి ఏం చేసినా అస్సలు తొలగిపోవు. ఇలాంటి మరకలను పోగొట్టడానికి మీరు వెనిగర్ ను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో వేడి నీళ్లను తీసుకుని అందులో కొంచెం వెనిగర్ ను వేసి కలపండి. ఈ ద్రావణాన్ని బాటిల్ పై, వాటి మూతలపై రాయండి. దీన్ని 15 నిమిషాల తర్వాత శుభ్రమైన నీళ్లతో కడిగేస్తే సరిపోతుంది. 

బేకింగ్ సోడా,నిమ్మరసం

బేకింగ్ సోడా, నిమ్మరసం కూడా బాటిళ్లను క్లీన్ చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక గిన్నెలో బేకింగ్ సోడాను తీసుకుని అందులో తగినంత నిమ్మరసం వేసి పేస్ట్ చేయండి. ఇప్పుడు దీంట్లో వేడి నీళ్లు పోయండి. ఈ వాటర్ లో బాటిళ్లను వేసి కాసేపు నానబెట్టండి. ఆ తర్వాత డిష్ వాష్ తో కడిగి ఆరబెట్టి వాడండి. 

నిమ్మకాయ, వేప నీళ్లు

నిమ్మకాయ, వేపనీళ్లతో కూడా బాటిల్ లోపలి భాగాన్ని బాగా శుభ్రం చేయొచ్చు. ఇందుకోసం ఒక పెద్ద పాత్రలో నీళ్లను తీసుకోండి. దాంట్లో వేప ఆకులు, నిమ్మకాయ ముక్కలను వేసి బాగా మరిగించండి. దీంట్లో గ్లాస్ లేదా ఓన్లీ స్టీల్ బాటిళ్లను వేయండి. వేడి నీటిలో 20 నిమిషాల పాటు వీటిని నానబెట్టండి. ఆ తర్వాత ఎప్పటిలాగే సబ్బుతో బాటిల్ ను కడగండి. ఇలా చేస్తే బాటిల్ లో ఉండే క్రిములు చనిపోతాయి. 

click me!