దీపావళికి వాడిన పువ్వులతో ఏం చేయొచ్చో తెలుసా?

First Published Nov 1, 2024, 11:32 AM IST

దీపావళి పండుగకు రకరకాల పువ్వులను ఉపయోగిస్తుంటాం. అంటే రంగోలి వేయడానికి, గుమ్మానికి పూల దండలు, దేవుడికి సమర్పించడం కోసం మనం ఎన్నో పువ్వులను వాడుతాం. ఈ పువ్వులను తర్వాత ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

దీపావళి నాడు ఇంటిని రకరకాల పువ్వులతో అలంకరించడం నుంచి దేవుడిని పూజించడం వరకు పువ్వులను బాగా ఉపయోగిస్తాం. కానీ ఈ పువ్వులను మరుసటి రోజే చెత్త బుట్టలో వేస్తాం. కానీ ఈ పువ్వులను కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.

వీటిని రీసైక్లింగ్ చేయడం, సహజ ఉత్పత్తులుగా మార్చడం చాలా మంచిది. ఇవి పర్యావరణానికి కూడా మంచి మేలు చేస్తాయి. అందుకే వాడిన పువ్వులను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

ఎరువు

అవును వాడిన పవ్వులను మీరు ఎరువుగా కూడా వాడొచ్చు. ఇందుకోసం వీటిని కంపోస్టుగా మార్చి పూట కుండీల్లో, తోటల్లో వేయండి. ఇది మొక్కలకు సహజ ఎరువుగా పనిచేస్తుంది. అలాగే నేలకు మంచి పోషకాలను కూడా అందిస్తుంది. వీటిని వాడితే మీరు రసాయన ఎరువులను వాడాల్సిన అవసరం ఉండదు. అలాగే కూరగాయలు కూడా బాగా పండుతాయి. పూల మొక్కలు కూడా అందంగా వికసిస్తాయి. 

సబ్బు తయారీలో..

ఎండిన పువ్వులను మీరు సబ్బు తయారుచేయడానికి కూడా ఉపయోగించొచ్చు. మీకు తెలుసా? చామంతి, గులాబీ, మల్లె వంటి పువ్వులు మన చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో తయారుచేసిన సబ్బును వాడితే మన చర్మం తేమగా ఉంటుంది. మంచి వాసన కూడా వస్తుంది. అందుకే వీటిని ఎండబెట్టి సబ్బు తయారీలో ఉపయోగించొచ్చు. 
 

Latest Videos


అగరువత్తి

అగరువత్తి లేనిదే పూజ కాదు. కాబట్టి మీరు మిగిలిన, ఎండిని పువ్వులతో ధూప దీపాలు తయారు చేసుకోవచ్చు. కర్పూరం, గంధంతో తయారు చేసిన ధూపం ఇంటిని స్వచ్ఛంగా, పరిమళభరితంగా చేస్తుంది. 

ఫేస్ ప్యాక్

ఎండిన మల్లెపూలు, చామతి, గులాబీ పువ్వులను ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం వీటిని గ్రైండ్ చేసి అందులో గంధం, రోజ్ వాటర్ మిక్స్ చేసి ఫేస్ ప్యాక్  తయారుచేసుకోవాలి. ఇది మన చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే ముఖం అందంగా కనిపించేలా చేస్తుంది. 
 

నేచురల్ కలర్స్ 

బంతిపూలు, లావెండర్, మందారం, గులాబీ వంటి పూలతో కూడా మనం నేచురల్ కలర్స్ ను తయారుచేసుకోవచ్చు. ఇది పర్యావరణానికి మాత్రమే కాదు.. మన చర్మానికి కూడా మంచి మేలు చేస్తుంది. వీటిని ప్రమాదకరమైన కెమికల్స్ స్థానంలో ఉపయోగించొచ్చు. 

హెర్బల్ ఆయిల్స్ 

మిగిలిన పువ్వులను మీరు హెర్బల్ ఆయిల్స్ గా కూడా జుట్టుకు వాడొచ్చు. ఇవి మీ జుట్టును మందంగా, పొడుగ్గా పెరిగేలా చేస్తాయి. ఇందుకోసం ఎండిన పువ్వులను నువ్వుల నూనె లేదా కొబ్బరి నూనెలో కలిపి మూలికా నూనెను తయారుచేసి వాడాలి. ఇది మీ జుట్టు, చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

నేచురల్ పెర్ఫ్యూమ్

పూజకు వాడిన పువ్వులను నేచురల్ పెర్ఫ్యూమ్ గా కూడా ఉపయోగించొచ్చు. ఇది మీ ఇంట్లో రీఫ్రెష్ నెస్, మంచి సువాసనను అందిస్తుంది. 

click me!