జుట్టును దువ్వుకోకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Nov 1, 2024, 10:26 AM IST

జుట్టు ఆరోగ్యం కోసం జుట్టును రెగ్యులర్ గా దువ్వడం చాలా అవసరం. అయితే కొంతమంది జుట్టును ఒకటి రెండు రోజులు కూడా దువ్వకుండా ఉంటారు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందో తెలుసా?

జుట్టు పొడుగ్గా, ఒత్తుగా, నల్లగా ఉండాలన్న కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇందుకోసం రకరకాల షాంపూలను, నూనెలను వాడుతుంటారు. అందులోనూ జుట్టు ఆరోగ్యంగా, స్మూత్ గా ఉండటానికి ప్రతిరోజూ నెత్తిని దువ్వుకుంటాం. అయినా కొంతమంది జుట్టు హెల్తీగా ఉండదు.

అలాగే చిక్కులు ఎక్కువగా పడతాయి. వెంట్రుకలు కూడా బాగా రాలతాయి. దీనికి కారణాలు చాలానే ఉన్నాయి. వీటిలో ఒకటి జుట్టును సరిగ్గా దువ్వకపోవడం. అవును కొంతమంది జుట్టును రెండు రోజులైనా దువ్వకుండా ఉంటారు. కానీ ఇలా దువ్వకుండా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? 
 

రోజూ జుట్టును ఎందుకు దువ్వాలి

జుట్టును రోజూ దువ్వడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. దీనివల్ల మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే రోజూ మీరు జుట్టును దువ్వుకోవడం వల్ల పెద్దగా చిక్కులు పడదు. అలాగే నెత్తిమీద, వెంట్రుకల్లో మురికి కూడా ఉండదు. దీనివల్ల మీ జుట్టు ఊడటం, చిక్కులు పడటం తగ్గుతుంది. అందుకే ప్రతిరోజూ జుట్టును దువ్వడం అవసరం. 

రెండు రోజులు జుట్టును దువ్వకపోతే ఏమౌతుంది?

జుట్టును దువ్వకపోతే ఏం జరుగుతుందని చాలా మందికి డౌట్ వస్తుంది. అయితే జుట్టును దువ్వకపోతే నెత్తి చిక్కులు పడటం తప్పా మరేం జరగదని చాలా మంది అనుకుంటారు. కానీ మీరు వరుసగా 2 రోజుల పాటు దువ్వకపోతే మీ నెత్తిమీద, జుట్టు రెండు ప్రమాదంలో పడతాయి. 
 

Latest Videos


పొడి జుట్టు

మీరు గనుక రెండు రోజుల పాటు నెత్తిని దువ్వకుండా ఉంటే గనుక మీ జుట్టు పొడిబారుతుంది. అలాగే జుట్టు దాని సహజ మెరుపును కోల్పోతుంది. దీనివల్ల మీ జుట్టు జీవం లేనట్టుగా కనిపిస్తుంది. అందుకే నెత్తిని ప్రతిరోజూ దువ్వడం అవసరం. 

స్కాల్ప్ ఇన్ఫెక్షన్ ప్రమాదం

మీకు తెలుసా? బయటకు వెళ్లినా, ఇంట్లో ఉన్నా కంటికి కనిపించే, కనిపించని దుమ్ము కణాలు మన జుట్టుకు అంటుకుంటాయి. ఇలాంటి పరిస్థితిలో మీరు రెండు రోజుల పాటు నెత్తిని దువ్వకపోతే అది స్కాల్ప్ ఇన్ఫెక్షన్ కు కారణమవుతుందని నిపుణులు అంటున్నారు. 
 

రక్త ప్రసరణపై ప్రభావాలు

రోజూ నెత్తిని దువ్వడం వల్ల మన జుట్టు హెల్తీగా ఉంటుంది. జుట్టు కూడా బాగా పెరుగుతుంది. దువ్వడం వల్ల నెత్తిమీద రక్తప్రసరణ పెరుగుతుంది. కానీ నెత్తిని దువ్వకపోతే  నెత్తిమీద రక్త ప్రసరణ సరిగ్గా జరగదు. ఇది మీ జుట్టు ఊడిపోయేలా చేస్తాయి. అలాగే జుట్టు నిర్జీవంగా మారుతుంది.

చుండ్రు సమస్య

మీరు వరుసగా రెండు రోజుల పాటు జుట్టును దువ్వుకోపోతే తలలో చుండ్రు విపరీతంగా పెరుగుతుంది. దీంతో మీ జుట్టు పొడిబారడమే కాకుండా.. వెంట్రుకలు విపరీతంగా రాలిపోతుంది. అందుకే జుట్టును రెగ్యులర్ గా దువ్వుకోవాలని నిపుణులు చెప్తారు. 
 

hair

జుట్టు మరింత చిక్కుగా మారుతుంది

వరుసగా మీరు రెండు రోజుల పాటు దువ్వుకోకపోతే మీ జుట్టు మరింత చిక్కులు పడుతుంది. ఇలాంటి పరిస్థితిలో.. మీరు దువ్వుతుంటే మీ జుట్టు బాగా తెగిపోతుంది. మీకు కూడా ఇలాంటి సమస్యలేమీ రాకూడదంటే మాత్రం జుట్టును రెగ్యులర్ గా దువ్వండి.  
 

click me!