Face Glow: మనం అందాన్ని పెంచుకోవడానికి పైపై మెరుగులు ఎన్ని చేసినా కూడా లోపలి నుంచి రావాలి. దాని కోసం మనం అందాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి. మీరు ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క జ్యూస్ తాగడం వల్ల అందాన్ని పెంచుకోవచ్చు.
వయసు పెరుగుతున్నా కూడా అందాన్ని పెంచుకోవాలనే తాపత్రయం మహిళల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే... చాలా మంది రెగ్యులర్ గా బ్యూటీ పార్లర్ కి వెళ్తూ ఉంటారు. ఏవేవో ఫేషియల్స్ చేయించుకుంటూ ఉంటారు. వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. అంత ఖర్చు చేయలేని వాళ్లు... ఇంట్లో దొరికే పాలు, శనగ పిండి, పసుపు లాంటివి ఏవేవో పూసేస్తారు. ఇవన్నీ... చర్మాన్ని బాహ్యంగా అందంగా మార్చడానికి చేసే ప్రయత్నాలు. అయితే... మనం అందాన్ని పెంచుకోవడానికి పైపై మెరుగులు ఎన్ని చేసినా కూడా లోపలి నుంచి రావాలి. దాని కోసం మనం అందాన్ని పెంచే ఆహారాలు తీసుకోవాలి. మీరు ప్రతిరోజూ కేవలం ఒకే ఒక్క జ్యూస్ తాగడం వల్ల అందాన్ని పెంచుకోవచ్చు. యవ్వనంగా మారొచ్చు. మరి, ఆ జ్యూస్ ఏంటి..? దానిని ఎలా తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు చూద్దాం...
23
చర్మాన్ని అందంగా మార్చే పండ్లు....
1.దానిమ్మ...
శరీరానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఆరోగ్యాన్ని అందించగల ముఖ్యమైన పండ్లలో దానిమ్మ ఒకటి. చర్మం, దానిమ్మలోని అన్ని పండ్లను ఉపయోగించవచ్చు. దానిమ్మ పండ్లను జ్యూస్ చేసి ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాస్ తినాలి. కావాలంటే.. దానిమ్మ గింజలను రోజూ గిన్నెడు తిన్నా చాలు. ఇలా నిరంతరం చేసినప్పుడు... దానిలోని విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు పంపేలా చేస్తాయి. శరీరాన్ని శుభ్రపరచినిప్పుడు.. చర్మం కూడా తాజాగా మారుతుంది. దానిమ్మ జ్యూస్ తాగడం మాత్రమే కాకుండా... దానిమ్మ గింజలను పౌడర్ లా చేసి.. స్క్రబ్ గా మార్చినా కూడా డెడ్ స్కిన్స్ ని తొలగించవచ్చు. దీని వల్ల కూడా మురికి తొలగిపోయి... అందంగా కనపడతారు. చర్మం స్మూత్ గా మారుతుంది. మొటిమల సమస్య కూడా ఉండదు.
33
బీట్‌రూట్:
చర్మ సంరక్షణ విషయానికి వస్తే, బీట్‌రూట్ వెంటనే గుర్తుకు వస్తుంది. బీట్‌రూట్ ఎక్కువగా తినడం వల్ల మీ ముఖం మెరిసిపోతుంది బీట్‌రూట్ రసం శరీరానికి శక్తిని ఇస్తుంది. చర్మాన్ని తాజాగా , ప్రకాశవంతంగా చేస్తుంది. బీట్‌రూట్‌ను బాగా మెత్తగా చేసి, వడకట్టి ప్రతిరోజూ ఉదయం త్రాగాలి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు , పోషకాలు శరీర రక్త ప్రసరణను పెంచుతాయి. శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా ఉన్నంత వరకు, శరీరం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉంటుంది.
ఈ దానిమ్మ, బీట్ రూట్ రెండూ కలిపి జ్యూస్ గా తాగినా కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు. అందంగా కనిపిస్తారు.