Face Glow: ముఖంపై బ్లాక్ హెడ్స్ వస్తున్నాయా? ఇవి రాస్తే చిటికెలో మాయం..!

Published : Nov 14, 2025, 02:11 PM IST

Face Glow: వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు రావడం చాలా సహజం. వీటికి తోడు ముఖంపై బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ లాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇవి ముఖాన్ని దెబ్బతీస్తాయి.

PREV
15
Beauty tips

స్త్రీలు అందానికి మారుపేరు అని చెప్పొచ్చు. పురుషుల కంటే స్త్రీలు ఎల్లప్పుడూ తమ ముఖాలను ప్రకాశవంతంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. దీని కోసం బ్యూటీ పార్లర్ లకు వెళ్లడం నుంచి ఇంట్లో కొన్ని బ్యూటీ చిట్కాలను పాటించడం ద్వారా వారు తమ ముఖాలను అందంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే, పోషకార లోపం, చర్మం పై పేరుకుపోయిన డెడ్ స్కిన్ సెల్స్ చర్మంపై అనేక సమస్యలను కలిగిస్తాయి.

ముఖ్యంగా మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. వీటిని అలానే వదిలిస్తే... మీ చర్మం నిస్తేజంగా మారుతుంది. వీటిని తొలగించాలంటే స్క్రబ్బింగ్ బెస్ట్ ఆప్షన్. ఇలాంటి స్క్రబ్బర్స్ మార్కెట్లో చాలానే లభిస్తూ ఉంటాయి. అయితే.. రసాయనాలు లేకుండా ముఖంపై వాటిని తొలగించాలి అనుకుంటే మీరు ఇంట్లోనే వీటిని ప్రయత్నించవచ్చు. మరి, అవేంటో ఓసారి చూద్దాం...

25
వాల్ నట్ స్క్రబ్

ముఖంపై పేరుకుపోయిన బ్లాక్ హెడ్స్, మొటిమలను తొలగించడంలో స్క్రబ్ సహాయపడుతుంది. ముందుగా ఒక గుప్పెడు వాల్ నట్స్ , తేనె తీసుకోవాలి. ముందుగా.. వాల్ నట్స్ ని మిక్సీలో వేసి మెత్తని పొడి చేసుకోవాలి. దీనిని ఒక గిన్నెలో వేసి.. అందులో కొద్దిగా తేనె కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ మొత్తానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత... చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. బ్లాక్ హెడ్స్ తొలగిపోతాయి. చర్మం తాజాగా కనపడుతుంది. యవ్వనంగా కనిపిస్తారు.

35
నిమ్మకాయ, చక్కెర స్క్రబ్:

నిమ్మకాయ చర్మాన్ని సహజంగా కాంతివంతం చేయడానికి ఒక గొప్ప ఎంపిక. నిమ్మరసంలో కొద్దిగా బ్రౌన్ షుగర్ కలిపి స్క్రబ్ తయారు చేసుకోండి. దానిని మీ ముఖంపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయండి. తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. దీనిలోని విటమిన్ సి , యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ప్రకాశవంతం చేస్తాయి. అనేక చర్మ సమస్యలను కూడా తగ్గిస్తాయి.

45
గ్రీన్ టీ , చక్కెర స్క్రబ్:

యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న గ్రీన్ టీని ఉపయోగించి మీరు స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. గ్రీన్ టీ, చక్కెరను సమాన మొత్తంలో తీసుకొని స్క్రబ్ సిద్ధం చేసుకోండి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేయండి. అరగంట తర్వాత మీ ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి. దీనిలోని అన్ని పోషకాలు మీ ముఖాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి.

ఓట్ మీల్ , మిల్క్ స్క్రబ్:

ఒక కప్పు ఓట్ మీల్ ను పాలతో కలిపి స్క్రబ్ సిద్ధం చేయండి. దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేయండి. తర్వాత మీ చేతులతో మీ చర్మాన్ని సున్నితంగా స్క్రబ్ చేయండి, 10 నిమిషాలు అలాగే ఉంచండి, ఆపై దానిని కడగాలి. ఇది చనిపోయిన చర్మ కణాలను తొలగించి మీ చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

55
స్క్రబ్‌ను ఉపయోగించే మార్గాలు:

చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి సహాయపడే సహజ స్క్రబ్‌లను ముఖానికి గట్టిగా రుద్దకూడదు. చర్మానికి సున్నితంగా అప్లై చేస్తే చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. వారానికి రెండుసార్లు కంటే ఎక్కువ స్కిన్ బ్రైటెనింగ్ స్క్రబ్స్ వాడండి. ఉపయోగించే సహజ పదార్థాలలోని పోషకాలు చర్మానికి మెరుపును ఇస్తాయి. దీనితో పాటు, మీ చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఎల్లప్పుడూ మాయిశ్చరైజర్ వాడండి. ఎండ నుండి రక్షించడంలో కూడా ఇది గొప్ప సహాయంగా ఉంటుంది.

చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుకోవాలనుకునే వారు, పైన పేర్కొన్న పద్ధతుల్లో స్క్రబ్స్, అనేక ఇతర బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించినా, శరీరానికి అంతర్గత పోషకాలను అందించడం అవసరం. పోషకాలు అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు , ధాన్యాలను ఆహారంలో చేర్చుకోవాలి. మీరు హైడ్రేటెడ్‌గా ఉన్నప్పటికీ చర్మ సమస్యలను నివారించడానికి ప్రతిరోజూ 2 లేదా 3 లీటర్ల నీరు త్రాగడం అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories