pregnancy
తల్లి అవ్వడం మహిళల వరం. పెళ్లైన ప్రతి మహిళ తనను తాను అమ్మగా చూసుకోవాలని ఆశపడుతుంది. అందుకే.. గర్భం దాల్చిన నాటి నుంచి బిడ్డ పుట్టేవరకు చాలా జాగ్రత్తగా ఉంటారు. గర్భం దాల్చిన వెంటనే.. మహిళల్లో చాలా మార్పులు చోటుచేసుకుంటారు. వారి శరీరంలో విడుదలయ్యే హార్మోన్లు.. బరువు పెరగడానికి.. ఎద భాగం పెరగడానికి కారణమౌతాయి.
అంతేకాదు.. గర్భం దాల్చిన తర్వాత.. మీ శరీరం మీ నుంచి చాలా కోరుకుంటుంది. ఈ క్రమంలో.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకునేందుకు చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. అయితే.. మనం ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కూడా... తెలిసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం. కాగా.. ప్రెగ్నెన్సీలో చాలా మంది మహిళలు కామన్ గా చేసే తప్పులేంటి..? వేటికి దూరంగా ఉండాలో ఓసారి చూద్దాం..
1.గర్భం దాల్చిన తర్వాత చాలా మందిలో నీరసం, కళ్లు తిరగడం, వాంతులు అవ్వడం జరుగుతుంటాయి. వాటి వల్ల ఏదీ సరిగా తినాలని అనిపించదు. ఈ క్రమంలో చాలా మంది భోజనం చేయడం మానేస్తూ ఉంటారు. దాదాపు 6-10 మంది స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆహార విరక్తి కలిగి ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి.
అయితే, భోజనం చేయకుండా మానేయడం మాత్రం ఆరోగ్యకరమైనది కాదు, ముఖ్యంగా గర్భం దాల్చిన మొదటి మూడు, నాలుగు నెలల్లో ఆహారం చాలా మంచిగా తీసుకోవాలి. శిశువు ముఖ్యమైన అవయవాలు ఏర్పడటానికి, అభివృద్ధి చెందడానికి ఇది చాలా కీలకమైన సమయం. కాబట్టి.. పోషకాహారం కచ్చితంగా తీసుకోవాలి.
2.ఇక గర్భం దాల్చిన తర్వాత మహిళ బరువు పెరగడం చాలా సర్వ సాధారణ విషయం. ఎందుకంటే మీరు ఆరోగ్యంగా మరియు ఎటువంటి పరిమితులు లేకుండా తినడం వల్ల, మీ హార్మోన్ స్థాయిలు నిరంతరం మారుతూ ఉంటాయి. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా మంది తాము బాగా లావు అయిపోతున్నామని బెంగ, ఆందోళన పెట్టుకుంటారు. దీని వల్ల ఒత్తిడి పెరిగి.. అది మీ బిడ్డ పై పడే అవకాశం ఉంది. కాబట్టి.. బరువు గురించి పక్కన పెట్టి... ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి.
pregnancy
3.గర్భం దాల్చిన తర్వాత మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కడుపు ఉబ్బరంగా ఉండటం, కండరాల నొప్పులు, జీర్ణాశయ సమస్యలు ఇలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలా ఇబ్బంది వచ్చింది కదా అని ఏ మందులు పడితే.. ఆ మందులు వేసుకోకూడదు. దాని వల్ల కడుపులో బిడ్డకు ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
4.ఇక ప్రెగ్నెన్సీలో వ్యాయామం చేయడం చాలా మంచిది. అయితే.. మరీ ఎక్కువ శ్రమ పడటం కూడా అంత మంచిది కాదు. అలా అని.. బద్దకంగా కూర్చోవడం కూడా మంచిది కాదు. తేలికపాటి వ్యాయామాలు చేయడం మీకు, మీతో పాటు మీ బిడ్డ ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట.
5.తరచూ వైద్యులను సంప్రదించి హెల్త్ చెకప్స్ చేసుకుంటూ ఉండాలి. బాగానే ఉంది కదా అని వైద్యులను సంప్రదించకుండా ఉండటం మంచిది కాదు. ఇవి మాత్రమే కాదు .. ఈ సమయంలో సరైన జీవన శైలిని కూడా అలవాటు చేసుకోవాలి.
మీరు గర్భవతి అయితే ధూమపానం, మద్యం సేవించడం లేదా కెఫిన్ తీసుకోవడం మానేయాలి.ప్రాసెస్ చేసిన, చక్కెర పదార్థాలు వంటి అనారోగ్యకరమైన సౌకర్యవంతమైన ఆహారాలను తినవద్దు.
అలాగే, మీకు తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. తక్కువ నిద్ర గర్భధారణ అలసటకు దోహదపడుతుంది. మీరు ఇప్పటికే భారీ శరీర మార్పులకు వెళుతున్నప్పుడు అది మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు.