జుట్టు రాలడం ఆగిపోయి.. కుదుళ్లు బలపడాలా..?

First Published May 23, 2022, 4:32 PM IST

 మరి సహజంగా ఈ సమస్య నుంచి బయటపడటమెలా.. కుదుళ్లు బలంగా మారి.. జుట్టు అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి..? ఈ కింద స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా..
 

జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు మనలో చాలా మందే ఉన్నారు. జుట్టు రాలడానికి చాలా కారణాలు ఉన్నాయి. మనం సరైన కేర్ తీసుకోకపోడంతో పాటు.. మనం తీసుకునే ఆహారం, వాడే షాంపూలూ, నూనెలు.. ఇతర లైఫ్ స్టైల్, అనారోగ్య సమస్యలు అన్నీ పరిగణలోకి వస్తాయి. కారణాలు ఏవైనా.. మనం సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అనేది మాత్రం వాస్తవం. మరి సహజంగా ఈ సమస్య నుంచి బయటపడటమెలా.. కుదుళ్లు బలంగా మారి.. జుట్టు అందంగా మెరిసిపోవాలంటే ఏం చేయాలి..? ఈ కింద స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దామా..
 


1.ప్రోటీన్ ఆహారం..
మీ జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకు కెరాటిన్ అనే ప్రోటీన్ చాలా అవసరం. అందుకే... మన జుట్టు ఆరోగ్యంగా ఉండాలి అంటే... ప్రోటీన్ రిచ్ డైట్  చాలా అవసరం. ఇది జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. అంతేకాకుండా.. జుట్టు మృదువుగా, మెరుస్తూ.. కుదుళ్లను బలంగా మారుస్తుంది.
 

2.నీరు తాగడం..

మన శరీరానికి మంచి నీరు అవసరం అనే విషయం మనకు తెలుసు. కానీ మన జుట్టుకు కూడా నీరు అవసరం. మన శరీరంతో పాటు.. మన జుట్టుకు కూడా హైడ్రేటెడ్ గా ఉంచడం అవసరం. తగినంత నీరు త్రాగడం వలన మీ జుట్టు హైడ్రేట్ చేరయగలం. జుట్టు విరిగిపోయే ప్రమాదాన్ని నీరు ఆపుతుంది. 
 

3.హెడ్ మసాజ్..

చాలా మంది హెడ్ మసాజ్ లను ఇష్టపడతారు. అయితే.. ఈ మసాజ్ లు మనకు రిలాక్స్ ఇవ్వడంతో పాటు.. జుట్టు కుదుళ్లు బలంగా మారతాయి. ఆయిల్ తో మసాజ్ చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి.. ఒత్తిడి తగ్గించడానికి సహాయం చేస్తాయి.  స్కాల్ప్ మసాజ్ లు రక్త ప్రసరణను పెంచుతాయి. 
 

4. రసాయనాలను నివారించండి
టాక్సిక్ కెమికల్స్ మీ జుట్టుకు మంచివి కావు, అందుకే మీరు వాటికి దూరంగా ఉండాలి. హెయిర్ కలరింగ్ వంటి అనేక స్టైలింగ్ ట్రెండ్‌లు మీ మూలాలపై ఒత్తిడిని కలిగిస్తాయి, జుట్టు పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. పారాబెన్లు, సల్ఫేట్లు వంటి విషపూరిత రసాయనాలను కలిగి లేనందున సహజ షాంపూ ,కండీషనర్లను ఉపయోగించడం మంచిది.

5.స్టైలింగ్ ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించండి

విపరీతమైన వేడి మీ జుట్టుకు మంచిది కాదు, ఎందుకంటే అది పొడిగా ఉంటుంది, ఇది చివర్లు చిట్లడం, చీలిపోయే అవకాశం ఉంది. అందుకే కర్లింగ్ రాడ్‌లు, స్ట్రెయిటెనర్‌లు, బ్లో డ్రైయర్‌ల వినియోగాన్ని కనిష్టంగా ఉంచడం మంచిది. అలాగే, మీరు మీ జుట్టును స్టైలింగ్ చేయడానికి ముందు రక్షిత ఉత్పత్తులను ఉపయోగించాలి.

click me!