పీరియడ్స్ నెల నెలా వస్తూనే ఉంటాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే.. ప్రతి నెలా వచ్చే పీరియడ్సే కదా అని వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. పీరియడ్స్ సమయంలో మనం చాలా శుభ్రత పాటించాలి లేదంటే.. అనేక రకాల ఆరోగ్య సమస్యలు మనల్ని వెంటాడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నేడు Menstrual Hygiene Day 2022 సందర్భంగా.. పీరియడ్స్ సమయంలో మనం ఎలాంటి పొరపాట్లు చేయకూడదు..? శుభ్రంగా ఉండేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రుతుక్రమం సమయంలో మనం పరిశుభ్రత కచ్చితంగా పాటించాలి. అలా పాటించడంలో విఫలమైతే వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడాల్సి ఉంటుందని గైనకాలజిస్ట్ లు చెబుతున్నారు.
రుతుస్రావం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. అంతేకుండా చాలా అవసరమైనది కూడా. అందుకే దీని విషయంలో మనం చాలా శ్రద్ద వహించాలి. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అలర్జీలు, యోని ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. కాబట్టి.. ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..
శానిటరీ నాప్‌కిన్‌లను మార్చిన తర్వాత చేతులు కడుక్కోవడం మంచిది. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లను నివారించడానికి మీకు సహాయపడుతుంది.
periods health tips
ప్యాడ్, కప్పు లేదా టాంపోన్‌ను ఎక్కువసేపు ధరించడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు వస్తాయి. తడిగా ఉండే ప్యాడ్ బ్యాక్టీరియా వృద్ధి చెందడానికి ,పెరగడానికి వేదికను ఏర్పాటు చేస్తుంది. దాని వల్ల మూత్రం వెళ్లే ప్రాంతంలో అంటువ్యాధులు, యోని ఇన్ఫెక్షన్లు, స్కిన్ ఎలర్జీలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్యాడ్ లైనింగ్ సున్నితమైన చర్మానికి కూడా చికాకు కలిగించవచ్చు.
బాక్టీరియల్ వాగినోసిస్...ఇది సహజంగా యోనిలో కనిపించే బాక్టీరియా యొక్క అధిక పెరుగుదల వలన ఏర్పడే ఒక రకమైన యోని మంట, సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత లోపించడం ఈ ఆందోళనకరమైన పరిస్థితికి దారి తీస్తుంది.
పునరుత్పత్తి మార్గము అంటువ్యాధులు, జననేంద్రియ మార్గము యొక్క అంటువ్యాధులు. పీరియడ్స్ సమయంలో పరిశుభ్రత లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. దేశంలోని ప్రధాన ఆరోగ్య సమస్యలలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.