Yoga: రోజులో పది నిమిషాలను యోగా కోసం కేటాయించి, కేవలం రెండు ఆసనాలు వేయడం వల్ల చాలా రకాల సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు.
30 ఏళ్లు దాటాయి అంటే... మహిళలు తమ ఆరోగ్యంపై చాలా ఎక్కువ శ్రద్ధ చూపించాలి. ఈ కాలంలో, చాలా మంది మహిళలు పీరియడ్స్ సరిగా రాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, జననేంద్రియ ఇన్ఫెక్షన్లు, సంతానోత్పత్తి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. నేటి మహిళల బిజీ లైఫ్ స్టైల్ కూడా దీనికి కారణం కావచ్చు. పని, కుటుంబం, ఇంటిని ఒకేసారి నిర్వహించడం, ఒత్తిడి కారణంగా మహిళల ఆరోగ్యం నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పటి నుంచి మహిళలు మందులు వాడటం మొదలుపెడతారు. కానీ, వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. దానికి బదులు.. యోగాని మీ లైఫ్ లో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా రెండే రెండు యోగాసనాలు ప్రతిరోజూ ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. మరి, ఆ యోగాసనాలేంటో చూద్దాం....
23
1.బటర్ ఫ్లై పోజ్...( సీతాకోక చిలుక భంగిమ)
ఈ యోగాసనం మహిళల మొత్తం శారీరక, మానసిక ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భంగిమ చేయడం చాలా సులభం. ఇందులో మొదట సుఖాసనంలో కూర్చొని, మీ కాళ్లను మడిచి, మీ పాదాలను ఒకదానితో మరొకటి తాకుతూ ఉండేలా చూసుకోవాలి. రెండు అర చేతులతో పాదాలను పట్టుకోవాలి, వీపును నిటారుగా ఉంచాలి. త ర్వాత గాలి పీల్చుతూ.. వాటిని పైకి లేపాలి.లేదంటే సీతాకోక చిలుక రెక్కలు ఆడించినట్లుగా ఊపుతూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల సంతానోత్పత్తి సమస్యలు తగ్గుతాయి. హార్మోన్ల అసమతుల్యత సమస్య కూడా తగ్గుతుంది.
33
పర్వాతాసనం...
ఈ ఆసనం వేయడం కూడా చాలా సులభం. వీ ఆకారంలో నిలపడటమే. దీని కోసం మీరు మీ పొట్ట ను నేలకు తాకేలా నేలపై పడుకోవాలి. మీ అరచేతులు, కాలి వేళ్లపై నొక్కి, మీ శరీరాన్ని పైకి లేపి వి ఆకారంలో నిలపడాలి. మీ అర చేతులు భుజాల కిందద, మీ మోకాళ్లు తుంటి కింద ఉండాలి. ఇప్పుడు మీ మొత్తం శరీర బరువు మీ అర చేతులు, కాలి వేళ్లపై ఉండేలా మీ తుంటిని పైకి లేపాలి. ఈ పొజిషన్ లో ఉండి.. శ్వాస తీసుకుంటూ, వదులుతూ ఉండాలి. ఈ ఆసనం చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును చాలా సులభంగా కరిగించవచ్చు.