స్ట్రెచ్ మార్క్స్ పోవాలని ఆడవారు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ అవి మాత్రం అస్సలు పోవు. అయితే మనం రోజూ జుట్టుకు వాడే కొబ్బరి నూనెతో ఈ మచ్చలు సులువుగా పోతాయని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
చాలా మందికి స్ట్రెచ్ మార్స్క్ ఉంటాయి. ఇవి కేవలం ఆడవారికి మాత్రమే కావు మగవారికి కూడా ఉంటాయి. అంటే పొట్ట, చేతులు వంటి శరీరంలోని చాలా భాగాల్లో ఇవి ఏర్పడుతుంటాయి. వీటివల్ల చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. నచ్చిన దుస్తులను వేసుకోలేక పోతుంటారు. అందుకే వీటిని పోగొట్టేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. ఖరీదైన క్రీం లను కూడా వాడుతుంటారు. అయినా ఇవి అస్సలు పోవు. అయితే కొబ్బరి నూనెను రాయడం వల్ల ఈ స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా పోతాయని చాలా మంది అనుకుంటారు. మరి దీనిలో నిజమెంతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
24
స్ట్రెచ్ మార్క్స్ ఎందుకు వస్తాయి?
స్ట్రెచ్ మార్క్స్ రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మన చర్మం ఫాస్ట్ గా పెరిగినప్పుడు, బరువు ఎక్కువగా పెరిగినప్పుడు, ప్రెగ్నెన్సీ సమయంలో, యుక్తవయసు, బరువులు ఎత్తడం వంటి కారణాల వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. వీటివల్ల మన చర్మం లోపలి పొర కొద్దిగా పగిలిపోయి స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి.
34
కొబ్బరి నూనెతో స్ట్రెచ్ మార్క్స్ పోతాయా?
కొబ్బరి నూనె మన చర్మానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మన స్కిన్ తేమగా ఉంటుంది. అలాగే సాఫ్ట్ గా ఉంటుంది. ఇది మన చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. అలాగే హైడ్రేట్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అయితే కొబ్బరి నూనెను వాడితే స్ట్రెచ్ మార్క్స్ పూర్తిగా పోవని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి మన చర్మం లోపలి పొరల నుంచి ఏర్పడతాయి. కాబట్టి కొబ్బరి నూనెతో స్ట్రెచ్ మార్క్స్ పోతాయనేది అవాస్తవం. ఇది కేవలం మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అయితే దీంతో కొత్త స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడవు.
44
స్ట్రెచ్ మార్క్స్ ను ఎలా తగ్గించుకోవాలి?
ఈ స్ట్రెచ్ మార్క్స్ ను పోగొట్టాలంటే మాత్రం మీరు ఖచ్చితంగా చర్మవ్యాధి నిపుణులను సంప్రదించాలి. అయితే వీటిని తగ్గించచే కొన్ని పద్దతులు కూడా ఉన్నాయి. కావాలనుకుంటే మీరు వీటిని ట్రై చేయొచ్చు.
పీఆర్పీ తో మైక్రోనెడ్లింగ్, మార్ఫియస్ 8, ఫ్రాక్షనల్ లేజర్లు వంటి ట్రీట్మెంట్ లతో మీరు స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించొచ్చు. అయితే వీటిని తొలగించేందుకు మీరు ఎంత తొందరగా చికిత్స తీసుకుంటే అంత మంచిదని నిపుణులు చెప్తారు.