Skin Care: చందనంలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాస్తే, ఇన్ స్టాంట్ గ్లో వచ్చేస్తుంది..!

ramya Sridhar | Published : Apr 18, 2025 10:24 AM

మీ ముఖంపై మొటిమలు వస్తే..గంధం, పసుపు ఈ రెండూ కలిపిన మిశ్రమం రాస్తే.. రెండు రోజుల్లో మచ్చలు కూడా లేకుండా మొటిమలు మొత్తం పోతాయి. అంతేకాదు.. వయసు రీత్యా వచ్చే ముడతలు కూడా మాయం అయిపోతాయి. 

15
Skin Care: చందనంలో ఇదొక్కటి కలిపి ముఖానికి రాస్తే, ఇన్ స్టాంట్ గ్లో వచ్చేస్తుంది..!
Fcepack for glowing skin


అందంగా కనిపించాలనే కోరిక అందరిలోనూ ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ముఖంలో గ్లో తగ్గుతుంది. తగ్గిపోయిన మెరుపు తగ్గించుకోవడానికి మార్కెట్లో దొరికే ఏవేవో క్రీములు, నూనెలు, సీరమ్స్ వాడుతూ ఉంటారు. అయినా కూడా ఫలితం లేదు అని మీకు అనిపిస్తే.. కచ్చితంగా ఈ హోం రెమిడీ ప్రయత్నించాల్సిందే. మరి, మీ అందాన్ని రెట్టింపు చేసే ఆ హోం రెమిడీ ఏంటో తెలుసుకుందాం..

25
facepack

ఆయుర్వేదం ప్రకారం పసుపు, గంధం రెండూ చర్మానికి మేలు చేస్తాయి. ఈ రెండూ ముఖానికి రాయడం వల్ల మీ అందం రెట్టింపు అవుతుంది. ఎందుకంటే, పసుపు, గంధం(చందనం)లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చాలా  రకాల చర్మ సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయం చేస్తాయి.

పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి మన చర్మంపై ముడతలు, మొటిమల సమస్యను తగ్గించడంలో సమర్థవంతంగా పని చేస్తాయి. అప్పుడప్పుడు మీ ముఖంపై మొటిమలు వస్తే..గంధం, పసుపు ఈ రెండూ కలిపిన మిశ్రమం రాస్తే.. రెండు రోజుల్లో మచ్చలు కూడా లేకుండా మొటిమలు మొత్తం పోతాయి. అంతేకాదు.. వయసు రీత్యా వచ్చే ముడతలు కూడా మాయం అయిపోతాయి. సహజంగా మీ ముఖం మెరుస్తూ కనపడేలా చేస్తుంది. గంధం ముఖానికి రాయడం వల్ల మంచి సువాసన రావడమే కాదు, చల్లదనం గా కూడా అనిపిస్తుంది.
 

35

1. ఒత్తిడి తగ్గిస్తుంది..

గంధంలో ఉండే సహజ సువాసన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది మెదడును శాంతింపజేస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మానికి గంధం పూస్తే, దాని వాసన వల్ల మంచి సానుభూతి, రిలాక్సేషన్ అనుభూతి కలుగుతుంది.

 2. సహజ డియోడరెంట్
గంధంలో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండటంతో ఇది శరీరం నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించడంలో సహాయం చేస్తుంది. ఎండాకాలంలో చెమట కారణంగా వచ్చే దుర్వాసన ఈ  చందనంతో పోతుంది.
 

45
Multani Mitti vs Sandalwood Powder

3. గాయాల నయం కోసం
పసుపులో ఉన్న కర్క్యూమిన్ అనే పదార్థం యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. చిన్న గాయాలపైన పసుపు పేస్ట్ రాస్తే, వేగంగా నయం అవుతాయి. ఇది ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.

 4. బేబీ స్కిన్‌కేర్లో భాగం
పసుపు,గంధం చిన్నపిల్లల చర్మం కోసం కూడా చాలా మంచివి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో పసుపుతో మిక్స్ చేసిన గంధాన్ని చిన్నారుల శరీరానికి పూతగా వాడతారు. ఇది చర్మాన్ని మెరిచేలా చేస్తుంది. చర్మంపై వచ్చే దురద వంటివి తగ్గిపోయేలా చేస్తాయి.

5. టానింగ్, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సహాయం
సూర్యకాంతి వల్ల చర్మంపై ఏర్పడే టానింగ్‌ను తగ్గించడంలో గంధం, పసుపు రెండూ బాగా పని చేస్తాయి. ముఖంపై పిగ్మెంటేషన్ కారణంగా వచ్చే మచ్చలను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. చర్మాన్ని మెరిచేలా చేస్తాయి.

55
Turmeric Sandalwood Face Pack

పసుపు ,గంధం ఉపయోగించడానికి, మీరు దాని పేస్ట్‌ను రోజ్ వాటర్‌తో కలిపి అప్లై చేయవచ్చు. మొటిమల సమస్య నుండి బయటపడటానికి, మీరు దానికి వేప నూనెను కూడా జోడించవచ్చు. లేదంటే మీరు ముల్తానీ మట్టిలో గంధం పొడి, రోజ్ వాటర్ లాంటివి కూడా కలిపి మంచి పేస్టు తయారు చేసుకొని ముఖానికి రాసుకోవాలి. అది పూర్తి గా ఆరిపోయిన తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే సరిపోతుంది.

Read more Photos on
click me!