Facial Hair:ముఖంపై హెయిర్ ఉందా? ఇవి రాస్తే ఈజీగా పోతాయి..!

Published : Apr 17, 2025, 01:31 PM IST

ముఖంపై అవాంఛిత రోమాలను.. టెంపరరీగా మాత్రమే కాదు.. పర్మినెంట్ గా కూడా తొలగించవచ్చు. దానికి కూడా మనం ఇంటి చిట్కాలు వాడితే సరిపోతుంది.

PREV
14
Facial Hair:ముఖంపై హెయిర్ ఉందా? ఇవి రాస్తే ఈజీగా పోతాయి..!
facial hair


చాలా మంది మహిళలకు ముఖంపై అవాంఛిత రోమాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా పెదాల పైన మీసాల్లా వచ్చి అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. వాటిని తొలగించుకోవడానికి చాలా మంది నొప్పితో కూడిన థ్రెడ్డింగ్, వ్యాక్సింగ్ లేదా.. కెమికల్స్ ఉంటే క్రీములు వాడుతూ ఉంటారు. అవి నొప్పి పెట్టేలా ఉంటాయి..లేదంటే స్కిన్ డ్యామేజ్ చేసేలా ఉంటాయి. అయితే.. ఈ సమస్యలు లేకుండా సహజంగా ఇంట్లోనే ముఖంపై అవాంఛిత రోమాలను పోగొట్టొచ్చు. మరి, అదెలాగో తెలుసుకుందామా..

24

ముఖంపై అవాంఛిత రోమాలను.. టెంపరరీగా మాత్రమే కాదు.. పర్మినెంట్ గా కూడా తొలగించవచ్చు. దానికి కూడా మనం ఇంటి చిట్కాలు వాడితే సరిపోతుంది. వాటిలో మొదటి కలబంద మాస్క్. ఈ కలబంద జెల్ లో శెనగపిండి కలిపి రాయడం వల్ల సమర్థవంతంగా ఆ ఫేస్ హెయిర్ ని మనం తొలగించవచ్చు. ఈ రెండూ కలిపి రాసి డ్రై అయిన తర్వాత స్క్రైబ్ చేయడం వల్ల.. హెయిర్ పోతుంది. స్కిన్ కూడా మెరుస్తూ కనపడేలా చేస్తుంది.

34

కలబంద, శెనగపిండి మాస్క్ ఎలా తయారు చేయాలి?

2 టేబుల్ స్పూన్లు శెనగ పిండి
1 టేబుల్ స్పూన్ కలబంద జెల్
1 టీస్పూన్ పసుపు
1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ లేదా పాలు
 

44
Facial Hair

ముందుగా, ఒక గిన్నెలో, శనగపిండి, కలబంద జెల్,పసుపు కలపండి. ఇప్పుడు రోజ్ వాటర్ లేదా పాలు వేసి నునుపైన పేస్ట్ తయారు చేయండి. ఈ పేస్ట్ ను మీ ముఖం మీద శుభ్రమైన, పొడి చర్మంపై జుట్టు పెరిగే దిశలో సమానంగా పూయండి. దీని తరువాత, మీ ముఖం మీద 15-20 నిమిషాలు ఆరనివ్వండి. దీని తరువాత, గోరువెచ్చని నీటితో మీ ముఖాన్ని కడుక్కుంటూ సర్కిల్ మోషనల్ తిప్పాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. హెయిర్ పోవడంతో పాటు.. ముఖం స్మూత్ గా, మెరుస్తూ కనపడుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories