వాడే విధానం:
ఈ నూనెతో తల, జుట్టుకు మంచిగా మసాజ్ చేయాలి. తర్వాత 30 నిమిషాలపాటు అలానే వదిలేయాలి. ఆ తర్వాత ఘాడత తక్కువగా ఉండే షాంపూని ఎంచుకొని దానితో తలస్నానం చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల.. మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. రెండు, మూడు వారాల్లోనే మీరు దీని రిజల్ట్ క్లియర్ గా చూడగలుగుతారు.
అదనంగా...
సోంపు కు మంచి మౌత్ ఫ్రెషనర్ గుణమూ ఉంటుంది. అంతేకాదు, ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అటువంటి గింజలతో తయారయ్యే నూనె జుట్టుకు హాని కాకుండా లాభమే ఇస్తుంది.ఇది సహజ, హానికర రసాయనాలు లేని పరిష్కారం కావడంతో, ఎవరైనా సురక్షితంగా ప్రయత్నించవచ్చు. మీరు కూడా ఈ ఇంటి చిట్కాను ఫాలో అవుతూ, జుట్టు ఆరోగ్యాన్ని తిరిగి పొందండి!