టీనేజ్ వయసు దాటింది అంటే చాలు... ముఖంపై మొటిమలు రావడం మొదలౌతాయి. ఈ మొటిమలు ముఖ అందం మొత్తం పాడు చేసేస్తాయి. మొటిమలు తగ్గినా.. వాటి తాలుకా వచ్చే మచ్చలు మాత్రం అంత తొందరగా వదలవు. ఇక చాలా మంది ఆ మచ్చలను తగ్గించుకునేందుకు ఏవేవో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. లేదంటే.. మేకప్ సహాయంతో వాటిని కవర్ చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే... మనం కొన్ని సింపుల్ రెమిడీలు ప్రయత్నించి కూడా.. మొటిమల తాలుకా మచ్చలు తొలిగించడంతో పాటు...మళ్లీ మొటిమలు రాకుండా చేయవచ్చు. మరి ఆ రెమిడీలు ఏంటో చూసేద్దామా...
24
బంగాాళదుంప
మనకు సులభంగా లభించే కూరగాయల్లో బంగాళదుంప ఒకటి. ఈ బంగాళ దుంపను చాలా మంది తమ స్కిన్ కేర్ లో ఉపయోగిస్తూనే ఉంటారు. ఇదే బంగాళదుంపతో మొటిమల సమస్యకు చెక్ పెట్టేయవచ్చు. డైరెక్ట్ గా బంగాళదుంప ను ముఖానికి రుద్దడం కాదు.. దీనిని మరికొన్ని వాటితో కలిపి..ముఖానికి అప్లై చేయాలి.
బంగాళదుంప, తేనె మాస్క్...
బంగాళ దుంప, తేనె కలిపి ముఖానికి రాయడం వల్ల.. మొటిమలు తగ్గడమే కాదు.. ముఖం మరింత అందంగా కూడా కనపడుతుంది. ఈ రెండూ కలిపి ముఖానికి స్క్రైబ్ చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ మొత్తం తొలగిపోతాయి. ఫేస్ స్మూత్ గా మారుతుంది.
34
ఈ ఫేస్ స్క్రబ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు...
బంగాళాదుంపలు, తేనె నుండి స్క్రబ్ చేయడానికి, ముందుగా బంగాళాదుంపలను మిక్సర్‌లో రుబ్బుకోవాలి.బంగాళాదుంప పేస్ట్ తీసుకొని ఒక కంటైనర్‌లో వేసి దానికి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ తేనె జోడించండి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలిపి దానికి విటమిన్ E క్యాప్సూల్స్ , క్రీమ్ జోడించండి. ఈ పేస్ట్‌ను బాగా కొట్టి కొంత సమయం అలాగే ఉంచండి.ఆ తర్వాత, మీరు ఈ స్క్రబ్‌ను మీ ముఖంపై 25 నిమిషాలు అప్లై చేయవచ్చు. మీ ముఖంపై స్క్రబ్ ఉపయోగించే ముందు, మీ ముఖాన్ని శుభ్రమైన నీటితో కడిగి, ఆపై ఉపయోగించండి.
25 నిమిషాల తర్వాత, మీ చేతులతో మీ ముఖాన్ని సున్నితంగా మసాజ్ చేయండి. ఈ స్క్రబ్‌ను వారానికి ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే ఉపయోగించాలి. ఇలా రెగ్యులర్ గా చేయడం వల్ల మొటిమల తాలుకా మచ్చలు తొలగిపోతాయి. చాలా అందంగా కనపడతారు.