ఆడవాళ్లు నుదిటిన బొట్టు పెట్టుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
తలనొప్పి తగ్గుతుంది:
ఆక్యుపంక్చర్ ప్రకారం.. కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం వల్ల తలనొప్పి వెంటనే తగ్గుతుంది. ఎందుకంటే ఈ ప్లేస్ లో ఒక నిర్దిష్ట బిందువు ఉంటుంది. దీన్ని మసాజ్ చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అందుకే నుదిటిన రోజూ బొట్టు పెట్టుకోవడం మంచిదని అంటారు.
నిద్రలేమి సమస్య తగ్గుతుంది:
నిద్రలేమి సమస్యను తగ్గించడానికి కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు అంటున్నారు. నుదిటిన బొట్టు పెట్టుకుంటే రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపడుతుందట. కనుబొమ్మల మధ్య బొట్టు పెట్టుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ముఖం, మెడ, శరీరం మొత్తం, కండరాలు కూడా సడలిస్తాయి. దీనివల్ల రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపడుతుంది.