రాత్రిపూట గిన్నెలను తోమకుండా సింక్ లో వేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

First Published | Dec 25, 2024, 5:30 PM IST

రాత్రి భోజనం చేసిన తర్వాత గిన్నెలను, ప్లేట్లను కడుక్కోకుండా సింక్ లో జమ చేస్తుంటారు ప్రతి ఒక్కరూ. కానీ ఇలా చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? 

ఒకప్పుడు మన అమ్మమ్మలు, నానమ్మలు ఎప్పుడు తిన్న గిన్నెలను అప్పుడే తోమి నీట్ గా వంటింట్లో సర్దేవారు. ముఖ్యంగా రాత్రిపూట తిన్న గిన్నెలను కడగకుండా వదిలేసేవారు కాదు. కానీ ఇప్పుడు పొద్దున్న తిన్న గిన్నెలను కూడా కడగకుండా సింక్ లో వేసేసి సాయంత్రం తోముతున్నారు. ఇక రాత్రి తిన్న , వండిన గిన్నెలను అలాగే సింక్ లో వేసి పొద్దున్న తోముతుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదని చెప్తారు పెద్దలు. 
 


ఇలాంటి ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుందని నమ్ముతారు. జ్యోతిషశాస్త్రం కూడా  ఇదే చెబుతోంది. అయితే జ్యోతిష్యం ప్రకారం రాత్రిపూట గిన్నెలను తోమాలనే నియమాన్ని పాటించాల్సిన అవసరం లేదు. కానీ దీనివల్ల మీకు ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీనికి కొన్ని శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అసలు రాత్రిపూట మురికి గిన్నెలను సింక్ లో ఉంచడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


రాత్రిపూట గిన్నెలను సింక్ లో వేసి నిద్ర ఎందుకు పోకూడదు? 

రాత్రి భోజనం తర్వాత గిన్నెలను కడగకుండా సింక్ లో వేస్తే మీ ఒక్కరి ఆరోగ్యం మాత్రమే కాదు మీ కుటుంబం మొత్తం ఆరోగ్యం దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు గిన్నెలను కడగకుండా వదిలేస్తే అందులో చెడు బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఇ.కోలి వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియా పెరుగుతుంది. ఈ బ్యాక్టీరియా సింక్ నుంచి వంటగది మొత్తం వ్యాపిస్తుంది. దీంతో అన్నీ కలుషితం అవుతాయి.
 

ఇది ఆరోగ్యానికి హానికరం

మురికిలో వృద్ధి చెందే ఈ బ్యాక్టీరియా మన ఆరోగ్యాన్ని బాగా దెబ్బతీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది మన రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుంది. మనల్ని బలహీనంగా చేస్తుంది. దీంతో శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గి రోగాల బారిన ఎక్కువగా పడతాం. అంతేకాకుండా బ్యాక్టీరియా వల్ల కొన్ని కొన్నిసార్లు విరేచనాలు, వాంతులు, కడుపునకు సంబంధించిన ఎన్నో సమస్యలు కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే టైఫాయిడ్, కామెర్లు, మూత్రపిండాల వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. 
 

తిన్న గిన్నెలను ఎంతసేపటిలో కడగాలి?

నిజం చెప్పాలంటే తిన్న వెంటనే గిన్నెలను కడగడం మంచిది. కానీ తిన్న ప్రతిసారీ కడగడం సాధ్యం కాకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో.. మీరు రెండు నుంచి మూడు గంటల తర్వాత కడగొచ్చు. అయితే ఇలాంటప్పుడు గిన్నెల్లో ఎలాంటి ఆహార పదార్థాలు ఉండకూడదు. పాత్రలను నీళ్లతో కడిగిన తర్వాతే సింక్ లో వేయండి. 

Latest Videos

click me!