స్కిన్ కేర్ చిట్కాలు
30 ఏళ్లు దాటాయి అంటే చాలు మన చర్మంలో అనేక మార్పులు మొదలౌతాయి. ముఖంలో అందం ఛాయలు తగ్గడం మొదలౌతుంది. నెమ్మదిగా కళ తప్పి.. రెండు, మూడు సంవత్సరాల్లోనే వృద్ధాప్య ఛాయలు చుట్టుముట్టేస్తాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే.. ముందు నుంచే స్కిన్ కేర్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. చర్మం ముడతలు పడటం, గీతలు రావడం లాంటివి రాకుండా ఉండాలంటే.. ఏం చేయాలి.. ఎక్కువ కాలం యవ్వనంగా కనిపించాలి అంటే.. 30 దాటిన మహిళలు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం...
యాంటీ-ఏజింగ్ స్కిన్ కేర్
అందం అనేది ఎక్కువగా మనం తీసుకునే ఆహారంపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే 30 దాటిన మహిళలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. వీటితో పాటు డైలీ స్కిన్ కేర్ రోటీన్ ఫాలో అవ్వాలి. స్కిన్ కేర్ అంటే.. బయట మార్కెట్లో దొరకే క్రీములే రాయాల్సిన అవసరం లేదు. ఇంట్లో లభించే కొన్నింటిని రాస్తే చాలు. మరి అవేంటో చూసేద్దామా...
30 ఏళ్ళ వారికి స్కిన్ కేర్
30 ఏళ్ళ వారికి స్కిన్ కేర్ చిట్కాలు:
పాలు : పాలు చర్మాన్ని కాంతివంతంగా, తేటగా మార్చడానికి బాగా సహాయపడతాయి. ఒక గిన్నెలో కొద్దిగా పాలు తీసుకోండి. ఒక కాటన్ బాల్ సహాయంతో దానిని ముఖానికి రాసుకుని కొంత సమయం తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే చర్మం లోతుగా శుభ్రపడుతుంది, మృదువుగా మారుతుంది.
అన్నం పిండి : కొద్దిగా అన్నం పిండితో పాలు కలిపి పేస్ట్‌లా చేసి ముఖానికి రాసుకుని ఫేస్ ప్యాక్‌లా వేసుకోండి. బాగా ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. ఈ ఫేస్ మాస్క్ ముఖానికి సహజమైన కాంతినిస్తుంది.
బ్యూటీ చిట్కాలు
తేనె : తేనె సహజమైన మాయిశ్చరైజర్ కాబట్టి దీన్ని మీ ముఖానికి నేరుగా రాసుకుని సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మీ ముఖ చర్మం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.
పెరుగు : పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది. కాబట్టి పెరుగు మీ ముఖానికి రాసుకుని కొంత సమయం తర్వాత ముఖం కడుక్కుంటే మీ చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖ్యంగా పెరుగు చర్మాన్ని తేమగా ఉంచుతుంది.
30 ఏళ్ళ స్త్రీలకు స్కిన్ కేర్
నిమ్మరసం : నిమ్మకాయ సహజమైన బ్లీచ్. కాబట్టి ఒక గిన్నెలో కొద్దిగా నిమ్మరసం, రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే ముఖంలోని మచ్చలు మాయమవుతాయి, ముఖం శుభ్రపడుతుంది, మృదువుగా, తాజాగా ఉంటుంది.
గమనిక : పైన చెప్పిన స్కిన్ కేర్ చిట్కాలతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తినడం, తగినంత నీరు త్రాగడం, ఒత్తిడి లేకుండా ఉండటం చాలా ముఖ్యం.