తెలుగు, తమిళ చిత్రాల్లో ప్రస్తుతం హవా చాటుతున్న హీరోయిన్లలో రష్మిక మందన ఒకరు. కేవలం దక్షిణాదిన మాత్రమే కాకుండా.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటేందుకు ఆమె సిద్దమౌతున్నారు. బాలీవుడ్ లో రెండు సినిమాలకు ఆమె సంతకం చేసినట్లు సమాచారం. ఇక ఇటు తెలుగులోనూ పుష్ప 2లో నటిస్తున్నారు. ఈ రోజు విడుదలైన సీతా రామమ్ లోనూ ఆమె కీలక పాత్ర పోషించారు.