తాను నిజానికి ఆహార ప్రియురాలు అయినప్పటికీ.. ఇండస్ట్రీలో ఉండటం వల్ల.. తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి మంచి ఆహారపు అలవాట్లను జాగ్రత్తగా చూసుకుంటానని ఆమె చెప్పారు. ఆమె ప్రతిరోజూ జిమ్ కి కచ్చితంగా వెళ్తారట. తాను తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు, ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు కచ్చితంగా ఉండేలా చూసుకుంటారట. ఇలాంటి సమతుల ఆహారం రోజుకి రెండుసార్లు తీసుకుంటారు. ఇక తన చర్మం కోసం.. ఉదయం, రాత్రి.. కచ్చితంగా స్కిన్ కేర్ రోటీన్ ని ఫాలో అవుతూ ఉంటారట.