కాలంతో సంబంధం లేకుండా.. అందంగా మెరిసిపోవాలని అందరూ అనుకుంటారు. అయితే.. మనం అందాన్ని పెంచుకోవడంలో విటమిన్ ఈ సహాయం చేస్తుందట. విటమిన్ E అనేది కొవ్వులో కరిగే విటమిన్. ఇది శరీరానికి యాంటీఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. ఇది మన శరీరంలోని కణాలను రక్షించడానికి ,మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి బాధ్యత వహిస్తుంది.
విటమిన్ E స్థిరమైన, క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వైరస్, అనారోగ్యంతో పోరాడటానికి పటిష్టమైన రక్షణ ఉంటుంది.విటమిన్ ఇ స్కిన్ టోన్ మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.
ఇది UV కిరణాలు, ధూళి కణాలు వంటి కాలుష్యం నుంచి రక్షించడంలోనూ ఇది సహాయం చేస్తుంది. విటమిన్ ఈ అధికంగా ఉండే ఉత్పత్తులను వాడటం వల్ల... వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉండేందుకు సహాయం చేస్తుంది.
విటమిన్ ఇ చర్మాన్ని రాడికల్ డ్యామేజ్ నుండి రక్షించడానికి, యాంటీ ఇన్ఫ్లమేషన్ కోసం ఉపయోగిస్తారు. విటమిన్ ఈ సహజ వైద్య లక్షణాలను అందిస్తుంది. ఇది త్వరగా గాయాలు తగ్గించడంలోనూ సహాయం చేస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడుతుంది కాబట్టి చర్మం మెరవడానికి సహాయపడుతుంది.
కేవలం చర్మం కోసం మాత్రమే కాకుండా.. జుట్టు పెరుగుదలకు కూడా విటమిన్ ఈ ఎంతగానో సహాయం చేస్తుంది. విటమిన్ ఈ ఉపయోగించడం వల్ల.. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి.. జుట్టు రాలడాన్ని కూడా నివారించడంలో సహాయం చేస్తుంది.
కేవలం చర్మం కోసం మాత్రమే కాకుండా.. జుట్టు పెరుగుదలకు కూడా విటమిన్ ఈ ఎంతగానో సహాయం చేస్తుంది. విటమిన్ ఈ ఉపయోగించడం వల్ల.. రక్త ప్రసరణ మెరుగుపరచడానికి.. జుట్టు రాలడాన్ని కూడా నివారించడంలో సహాయం చేస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా పెరగడంలో సహాయం చేస్తుంది.. విటమిన్ ఈ వాడటం వల్ల... జుట్టు కోల్పోయిన మెరుపును కూడా తిరిగి పొందే అవకాశం ఉంటుంది.