అందమైన కురులు మీ సొంతం కావాలా..? ఈ ఆయుర్వేద టిప్స్ మీ కోసమే..!

First Published Jun 3, 2022, 12:27 PM IST

మనం వాడే షాంపూలు, కండిషనర్స్ కూడా మనం జట్టు ఊడిపోవడానికి కారణం కావచ్చు. అయితే.. ఆయుర్వేదం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల...  జట్టు ను సంరక్షించుకోవచ్చట. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..
 

తమ జుట్టు అందంగా ఉండాలని.. నల్లగా, నిగనిగలాడుతూ ఉండాలని అందరూ కోరుకుంటారు. అయితే... మనం తీసుకునే ఆహారం, మన లైఫ్ స్టైల్ , కాలుష్యం కారణంగా జుట్టు విపరీతంగా ఊడిపోతూ ఉంటుంది. అంతేకాదు.. మనం సరిగా న్యూట్రీషన్ ఆహారం తీసుకోకపోవడం.. మనం వాడే షాంపూలు, కండిషనర్స్ కూడా మనం జట్టు ఊడిపోవడానికి కారణం కావచ్చు. అయితే.. ఆయుర్వేదం ప్రకారం మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల...  జట్టు ను సంరక్షించుకోవచ్చట. మరి ఆ జాగ్రత్తలేంటో ఓసారి చూద్దాం..
 

ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం... జుట్టుకు ఆయిల్ వారానికి కనీసం రెండు సార్లు రాయాలట. మీ వెంట్రుకలు మృదువుగా ఉండాలన్నా.. మెరిసిపోవాలన్నా... తలకు నువ్వుల నూనె లేదంటే.. కొబ్బరి నూనె,  లేదంటే బాదం నూనె ఏదైనా సరే... వారానికి రెండు సార్లు కచ్చితంగా రాయాలట. 

 వారానికి రెండు సార్లు కచ్చితంగా రాయాలట. ముఖ్యంగా బాదం, నువ్వులు, ఆముదం నూనెలతో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం జట్టు మృదువుగా, నిగనిగలాడుతుందట.

hair growth

సమయోచితంగా మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడమే కాకుండా, మీరు శరీరం లోపలకు కూడా  పోషకాహారాన్ని అందించాలి. ఈ కింది ఆహారాలను కచ్చితంగా తీసుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుందట.

విటమిన్ సి: ఇది "కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది". ఉసిరి, కివీస్, చిలగడదుంపలు, స్ట్రాబెర్రీలు, జామ, నారింజ, బ్లాక్‌బెర్రీస్ బొప్పాయి ,మిరియాలు తినండి..

విటమిన్ ఎ: ఇది స్కాల్ప్‌కు ఆరోగ్యకరమైన సెబమ్‌ను తయారు చేస్తుంది. చిలగడదుంపలు, క్యారెట్లు, మిరియాలు, గుమ్మడికాయ వంటి బీటా కెరోటిన్‌లతో కూడిన అన్ని కూరగాయలను తీసుకోవచ్చు.
 

విటమిన్ ఇ: నట్స్

* విటమిన్ డి: సన్ రైజ్, పాల ఉత్పత్తులు

*విటమిన్ బి కాంప్లెక్స్: దుంపలు, బచ్చలికూర, తృణధాన్యాలు, బీన్స్ వంటి కూరగాయలు.

*ఆరోగ్యకరమైన కొవ్వులు: నెయ్యి, నువ్వులు, అవిసె గింజలు, ఆలివ్ నూనె, కొబ్బరి నూనె మొదలైనవి ప్రోటీన్ ని అందిస్తాయి.

*ప్రోటీన్: లెంటిల్/బీన్స్, క్వినోవా, ఉసిరికాయ, గింజలు/విత్తనాలు, గుడ్లు, చేపలు తీసుకోవాలి.

ఆయుర్వేద నిపుణుడి ప్రకారం, ఉదయం లేదా నిద్రవేళలో రెండు నాసికా రంధ్రాలలో నెయ్యి / అను తైలాను ఉంచడం జుట్టు పెరుగుదలకు అద్భుతంగా పనిచేస్తుంది.ఇది మంచి నిద్రను అందిస్తుంది.

click me!