Aloe Vera: అందమైన అమ్మాయిలు అనగానే కొరియన్ బ్యూటీలు గుర్తొస్తారు. వీరి అందానికి సహజ పద్ధతులను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి ఒక నేచురల్ బ్యూటీ సీక్రెట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొరియన్ అమ్మాయిల చర్మం ఎందుకు అంత మెరిసిపోతుందో ఎప్పుడైనా ఆలోచించారా? వారి బ్యూటీ రొటీన్‌లో సహజ పదార్థాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అందులో అలోవెరా జెల్ ఒక ప్రధానమైనది. ఇది చర్మానికి లోతైన తేమను అందించడంతో పాటు టానింగ్, మొటిమలు, డల్నెస్ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
25
రాత్రిపూట చర్మ సంరక్షణ
పడుకునే ముందు ముఖంపై తాజా కలబంద జెల్ రాసి, సున్నితంగా మసాజ్ చేయండి. ఇది నైట్ క్రీమ్‌లా పని చేసి చర్మాన్ని రిపేర్ చేస్తుంది. ఉదయం నిద్రలేచే సమయానికి మీ ముఖం సహజమైన మెరుపుతో కనిపిస్తుంది.
35
టాన్ తొలగించడానికి
అలోవెరా జెల్‌లో నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి ముఖం, చేతులకు రాయండి. ఇది టాన్‌ను తగ్గించి, చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. మొటిమల తర్వాత వచ్చే నల్లటి మచ్చలను తగ్గించడానికి అలోవెరా జెల్‌ను కొద్దిగా పసుపుతో కలిపి రాయండి. ఇది చర్మాన్ని నయం చేయడమే కాకుండా మచ్చలను క్రమంగా లైట్ చేస్తుంది.
కలబంద జెల్‌లో తేనె, దోసకాయ రసం కలిపి మాస్క్‌లా వేసుకోవాలి. ఇది పొడి చర్మానికి లోతైన తేమను ఇస్తుంది అలాగే కొరియన్-స్టైల్ గ్లోని అందిస్తుంది. ప్రతి రాత్రి పడుకునే ముందు కళ్ల కింద కలబంద జెల్ రాయండి. ఇది చల్లదనాన్ని ఇచ్చి, డార్క్ సర్కిల్స్‌ను తగ్గిస్తుంది. కళ్లకు తాజా లుక్ ఇస్తుంది.
55
ఇన్‌స్టంట్ గ్లో & మేకప్ ట్రిక్
గ్లో సీరం – అలోవెరా జెల్‌లో రోజ్‌వాటర్, గ్లిజరిన్ కలిపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోండి. ప్రతిరోజూ టోనర్‌లా వాడితే సహజమైన తాజాదనం వస్తుంది. మేకప్ వేసుకునే ముందు అలోవెరా జెల్ రాయడం వల్ల చర్మం మృదువుగా మారి, మేకప్ ఎక్కువసేపు నిలుస్తుంది.