ఒకప్పటి మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యారాయ్ గురించి ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అందానికి చిరునామాగా ఐశ్వర్యరాయ్ గా చెబుతుంటారు. అందాల తార గా అందరి మన్నలను పొందిన ఆమె.. బాలీవుడ్ లోనూ తన సత్తా చాటారు. అయితే.. పెళ్లై.. తల్లిగా మారిన తర్వాత ఆమె సినిమాలకు దూరమయ్యారు.
సినిమాలకు దూరమైన ఆమె పేరెంటింగ్ లో బిజీగా మారారు. ఆమె నుంచి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కచ్చితంగా కొన్ని నేర్చుకోవాల్సిందే. ఆమె చాలా సార్లు చాలా బిజీగా ఉన్నప్పటికీ... తల్లిగా మాత్రం ఎప్పుడూ ది బెస్ట్ ఇస్తూ వచ్చారు. తన కూతురి కోసం ఆమె కొంతకాలం పాటు.. తన కెరిర్ ని కూడా పక్కన పెట్టేశారు.
చాలా మంది డబ్బున్నవారు తమ పిల్లలను పనివారికి అప్పగిస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ.. ఐశ్వర్యారాయ్ మాత్రం తన కూతురి విషయంలో అన్నీ తానే చూసుకుంటారు. తన కూతురిని స్కూల్ దగ్గర దింపడం.. మళ్లీ.. ఇంటికి తీసుకురావడం లాంటి అన్ని పనులను ఆమే స్వయంగా చేసేది.
అంతేకాదు.. పాపను స్టూడియో, ఈవెంట్స్ వేటికి తీసుకువెళ్లాలి అన్నా ఆమె స్వయంగా తీసుకువెళ్లేవారట. తన కూతురు పనులను ఆమె స్వయంగా చేసేవారు.
తన కూతురికి క్వాలిటీ టైమ్ ఇవ్వడంలో ఐశ్వర్య రాయ్ ఎప్పుడూ ఫెయిల్ అవ్వలేదు. తన కూతురు అన్ని విషయాల్లో చాలా కాన్ఫిడెంట్ గా, మెచ్యూర్డ్ గా ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే.. తన కూతురు తో కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా ఉండేలా చూసుకుంటారు.
తన కూతురి విషయంలో ఆమె అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉంటారు. ఏ విషయంలోనూ తన కూతురు బాధ పడకుండా ఉండేందుకు ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. తన కూతురు ఆరాధ్య ఎప్పుడూ ఆనందంగా ఉండేలా ఆమె చూసుకుంటూ ఉంటారు.
ఇక సెలబ్రెటీలు, వారి పిల్లలు ఎక్కడ కనపడినా.. వారి వెంట కెమేరాలు వెంట పడుతూనే ఉంటాయి. అయితే.. ఆ విషయంలోనూ ఐశ్వర్య చాలా జాగ్రత్తగా ఉంటారు.
Aishwaryarai
తమ కూతురు ఆరాధ్య ను కెమేరాల కంట పడకుండా జాగ్రత్తపడేవారు. చిన్న పిల్ల కావడంతో కెమేరాలను చూసి భయపడుతుందని..వాటికి ఆమెను దూరంగా ఉంచేవారు. మీడియాలో ప్రతిరోజూ తన కూతురు ఒక వార్త కాకుండా ఉండేందుకు ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
ఆమె తన మాతృత్వానికే ఎక్కువ విలువ ఇచ్చారు. పాప పుట్టిన వెంటనే సినిమాల వైపు అడుగులు వేయాలని ఆమె అనుకోలేదు. దానికన్నా కూడా... తన కూతురితో తాను ఉండటమే ముఖ్యమని ఆమె భావించారు.
ఇక సెలబ్రెటీలు, వారి పిల్లలు నెటిజన్ల ట్రోల్స్ కి గురవ్వడం కూడా చాలా కామన్. అయితే.. ఆ ట్రోల్స్ కూడా.. తన కూతురిపై ఎలాంటి ప్రభావం చూపించకుండా ఉండేలా ఆమె చర్యలు తీసుకునేవారు. ఆ ట్రోల్స్ ఏమీ తన కూతురిపై రాకుండా ఉండేందుకు కూడా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.