బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అటుబాలీవుడ్ తో పాటు.. ఇటు టాలీవుడ్ లోనూ ఆమె తన సత్తా చాటారు. ఆమె ఇండస్ట్రీలోకి అడుగుగపెట్టి చాలా సంవత్సరాలే అవుతోంది. ఆ తర్వాత ఆమె ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయ్యారు. ప్రస్తుతం ఆమె నాలుగు పదుల వయసులో ఉన్నారు. అయినప్పటికీ.. ఆమె అందం కొంచెం కూడా చెక్కు చెదరలేదు. ఆమె తన అందాన్ని కాపాడుకోవడానికి ఆమె ఏం చేస్తారు..? ఏం తింటారు..? ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటో ఓసారి చూద్దాం..
శిల్పా శెట్టి ఏరోజూ అల్పాహారాన్ని మిస్ చేసుకోరట. అల్పాహారం కచ్చితంగా తీసుకుంటారు. ఆపిల్, మ్యాంగో, బాదం పాలు లాంటివి కాకుండా... గంజి, ఉడికించిన కోడిగుడ్లను ఆమె అల్పాహారంగా తీసుకుంటారట. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోతే.. మీ మెదడు, శరీరం సరిగా పనిచేయదట. దాని వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టటి.. కచ్చితంగా అల్పాహారం తీసుకోవాలని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
సన్నగా ఉండటానికి ఆమె తినకుండా మాత్రం ఉండదట. ఆకలితో అలమటించడం ఆమెకు ఇష్టం ఉండదట. అయితే.. ఎలాంటి ఆహారం పడితే అలాంటి ఆహారం తీసుకోకుండా.. కేవలం సమతుల్య ఆహారాన్ని మాత్రమే తీసుకోవడానికి ఇష్టపడుతుంది.
ఇక తన ఆహారంలో ఆమె కొబ్బరి పాలను చేర్చుకున్నారట. కొబ్బరి పాలను తన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. బరువు తగ్గడంలోనూ.. సహాయపడిందని ఆమె చెప్పారు. అంతేకాకుండా.. చర్మానికి సహజమైన కాంతిని అందించడంలోనూ సహాయపడుతుందట.
ఇక తన శరీరం ఫిట్ గా కనిపించేందుకు ఆమె యోగాను ఎంచుకున్నారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు మనకు తెలిసిందే. కాగా.. ఆమె ప్రతిరోజూ యోగా చేస్తారట. యోగా శరీరాన్ని చక్కటి ఆకారంలో ఉంచడంతో పాటు.. మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. అంతేకాదు.. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలకంగా పనిచేస్తుంది. అందుకే ఆమె కచ్చితంగా ప్రతిరోజూ యోగా చేస్తారట.
ఇక.. ఆమె తాను తీసుకునే ఆహారంలో చెక్కరను దూరంగా ఉంచుతారట. చెక్కరతో తయారు చేసిన ఆహారాలను ఆమె అస్సలు తీసుకోరట. చెక్కరకు బదులుగా.. తేనె, బెల్లం, కొబ్బరి లాంటి వాటిని ఉపయోగిస్తారట. చెక్కరకు దూరంగా ఉండటం వల్ల ఫిట్ గా ఉండవచ్చని ఆమె చెప్పారు.
ఇక.. శిల్పా శెట్టి తాను తీసుకునే ఆహారం విషయంలో ఎంత కచ్చితంగా ఉంటారో.. ఆహారం తీసుకునే సమయంలోనూ అంతే కచ్చితంగా ఉంటారట. ఆమె తన డిన్నర్ ని సాయంత్రం 7:30కి ముందే పూర్తి చేస్తారట. ఆమె ఒక సామాజిక కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినప్పటికీ, ఆమె ఈ డైట్ ఆచారాన్ని నిర్వహించడంలో విఫలం కాదు. ఆమె డిన్నర్‌గా సూప్, చపాతీలు, కొద్దిపాటి కూరగాయలు తింటుంది. ఆమె తన డిన్నర్‌ను తేలికగా , ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. అదనపు క్యాలరీలు తీసుకోకుండా ఉండేలా ఆమె జాగ్రత్త పడుతుంది.