Face Glow: వేపాకులతో ఇవి కలిపి రాస్తే.. ముఖం బంగారంలా మెరిసిపోద్ది..!

Published : Jun 07, 2025, 11:43 AM IST

వేపాకులు వాడటం వల్ల ముఖం మచ్చలు లేకుండా, అందంగా కూడా మారుతుంది. అయితే అచ్చంగా వేపాకులు కాకుండా దాంట్లో ఇంకా కొన్ని మిక్స్ చేస్తే చాలు.

PREV
15
Face Glow

ముఖం మీద ముడతలు, మచ్చలు లేకుండా ఫేస్ క్లియర్ గా ఉంటే ఎంత అందంగా ఉంటుందో కదా. కానీ, వయసు పెరుగుతుంటే ముఖంపై ముడతలు, బ్లాక్ హెడ్స్, బ్లాక్ సర్కిల్స్, పిగ్మెంటేషన్ లాంటివి వచ్చేస్తూ ఉంటాయి. వీటిని పోగొట్టుకోవడానికి దాదాపు అందరూ ఖరీదైన క్రీములు వాడుతూ ఉంటారు. కానీ, అవి చాలా ఖరీదు ఎక్కువగా ఉంటాయి. మరి, వాటితో పనిలేకుండా, పార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవాల్సిన అవసరం లేకుండా కూడా అందంగా మెరిసిపోవచ్చు.

25
వేపాకు మాస్క్

ముఖ అందాన్ని పెంచడంలో వేపాకులు చాలా బాగా సహాయపడతాయి. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ.. వేపాకులు వాడటం వల్ల ముఖం మచ్చలు లేకుండా, అందంగా కూడా మారుతుంది. అయితే అచ్చంగా వేపాకులు కాకుండా దాంట్లో ఇంకా కొన్ని మిక్స్ చేస్తే చాలు. వారానికి ఒకసారి వేపాకు మాస్క్ రాయడం వల్ల.. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ వేపాకు మాస్క్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ఒక టీస్పూన్ వేప పొడిని రెండు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తో కలిపి, కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కాటన్ బాల్ కు వేసి, మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీని వల్ల ముఖంపై మురికి తొలగిపోతుంది. తర్వాత మీ ముఖం పొడిగా ఉండనివ్వండి. ఇప్పుడు తయారుచేసిన పేస్ట్ ను మీ ముఖంపై సర్కిల్ మోషన్ లో తిప్పుతూ మంచిగా మసాజ్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ లో గ్లో వెంటనే కనపడుతుంది.

35
వేప, రోజ్ వాటర్ ఫేస్ మాస్క్

కొన్ని వేప ఆకులను తీసుకొని, రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దానిని మీ ముఖం, మెడపై అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఈ మాస్క్ యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. ముఖంపై మచ్చలను తొలగిస్తుంది.

45
వేప, శనగపిండి, పెరుగు ఫేస్ మాస్క్

ఒక టీస్పూన్ వేప పొడిని ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, పెరుగుతో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ముఖం కడిగిన తర్వాత, ఈ మాస్క్ ని అప్లై చేసి 15 నిమిషాలు అలాగే ఉంచి కడిగేయండి. ఈ మాస్క్ ని వారానికి రెండుసార్లు అప్లై చేయండి. ఈ మాస్క్ మొటిమలను తగ్గిస్తుంది, మచ్చలను తొలగిస్తుంది. ముఖానికి మెరుపును తెస్తుంది.

వేప, గంధపు మాస్క్

అర టీస్పూన్ గంధపు పొడిని ఒక టీస్పూన్ వేప పొడితో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్ ని రోజ్ వాటర్ తో కలిపి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఇప్పుడు దీన్ని మీ ముఖం, మెడపై అప్లై చేసి అరగంట తర్వాత, మీ ముఖాన్ని నీటితో కడిగి స్క్రబ్ చేయండి. ఈ పేస్ట్ ముఖాన్ని ప్రకాశవంతం చేస్తుంది. ముఖాన్ని శుభ్రపరుస్తుంది. చర్మాన్ని చాలా మృదువుగా చేస్తుంది.

55
వేప, తేనె మాస్క్

కొన్ని వేప ఆకులను చూర్ణం చేసి, ఒక టీస్పూన్ తేనె వేసి పేస్ట్ లా తయారు చేసుకోండి. బాగా కలిపి మీ ముఖం, మెడపై అప్లై చేయండి. అరగంట తర్వాత కడిగేయండి. ఇది మీ చర్మాన్ని పొడిగా చేయదు. మీకు జిడ్డుగల చర్మం ఉన్నప్పటికీ చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

వేప, తులసి ఫేస్ మాస్క్

కొన్ని తులసి, వేప ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోండి. ఈ పొడిలో ఒక టీస్పూన్ తేనె కలిపి ఈ పేస్ట్‌ను మీ ముఖం, మెడపై బాగా అప్లై చేయండి. ఆరనివ్వండి. అరగంట తర్వాత కడిగేయండి. ఈ హెర్బల్ మాస్క్‌తో, మీ చర్మం చాలా ఆరోగ్యంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories