కలబందను శతాబ్దాల నుంచి ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇది చర్మానికి మంచి మాయిశ్చరైజర్. కలబంద పొడి చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఎండ దెబ్బ, కాలిన గాయాలు, దురదలను తగ్గిస్తుంది. మొటిమలను కలిగించే బాక్టీరియాను అడ్డుకుంటుంది. కలబంద జెల్‌ను నేరుగా చర్మానికి రాసుకోవచ్చు. ఫేస్ మాస్క్‌లు, మాయిశ్చరైజర్లు, లోషన్లలో కూడా కలుపుకోవచ్చు.