Kitchen Hacks: రెండు నిమిషాల్లో వెల్లుల్లి పొట్టు తీయడం ఎలా?

Published : Aug 15, 2025, 01:09 PM IST

వెల్లుల్లితో వంటలు టేస్టీగా అవుతాయి. అందుకే ప్రతి కూరలో వెల్లుల్లిని ఖచ్చితంగా వేస్తారు. ఇదంతా బానే ఉన్నా.. వెల్లుల్లి పొట్టు తీయడం చాలా కష్టమైన పని. దీన్ని తీయడానికి ఆడవారు గంటలకు గంటలు కష్టపడుతుంటారు. 

PREV
15
వెల్లుల్లి

మన వంటగదిలో ఉండే ముఖ్యమైన మసాలా దినుసుల్లో వెల్లుల్లి ఒకటి. మసాలా దినుసుల్లో వెల్లుల్లిది ఒక ప్రత్యేక స్థానమనే చెప్పాలి. ఎందుకంటే ఇది వేస్తేనే వంటల టేస్ట్ అదిరిపోతుంది. 

అందుకే సాంబారు, రసం, పప్పు చారుతో పాటుగా అన్ని రకాల కూరల్లో వెల్లుల్లిని వేస్తారు. ఈ సంగతి పక్కన పెడితే.. వెల్లుల్లి పొట్టు తీయడం మాత్రం చాలా కష్టమైన పని. ఇది ఆడవారికి పెద్ద టాస్క్ అనే చెప్పాలి. 

ఒక్కొక్క వెల్లుల్లి రెబ్బ పొట్టు తీయాలంటే చాలా టైం పడుతుంది. కిలో వెల్లుల్లి పొట్టును తీయడానికి అర్థగంట లేదా గంట టైం తీసుకుంటారు. ఈ పొట్టును తీయడం వల్ల వేళ్లు కూడా నొప్పి పెడతాయి. 

అలాగే చేతుల మంట, జిగట, వేళ్లకు వెల్లుల్లి అంటుకోవడం వంటి సమస్యలు వస్తాయి. కానీ రెండే రెండు నిమిషాల్లో వెల్లుల్లి పొట్టును ఈజీగా తీయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
వెల్లుల్లి పొట్టును ఈజీగా తీయడం ఎలా?

వెల్లుల్లిని సులువుగా తొక్క తీయడం ఎలా?వెల్లుల్లి పొట్టును మన వేళ్లకు అంటుకోకుండా లేదా వాసన రాకుండా చాలా సులువుగా తీయొచ్చు. ఇందుకోసం ముందుగా పెద్ద పెద్ద వెల్లుల్లి పాయలను తీసుకోండి. 

వీటిని పెద్ద సిల్వర్ కంటైనర్‌లో పోసి బాగా షేక్ చేయండి. 30-40 సెకన్ల పాటు ఇలాగే చేయండి. దీనివల్ల వెల్లుల్లి రెబ్బలపై కొద్దిగా పొట్టు ఊడిపోతుంది. ఆ తర్వాత మీ చేతులు నొప్పి పెట్టకుండా చేతులతో చాలా సులువుగా పొట్టును తీయొచ్చు. ఇది చాలా సింపుల్ చిట్కానే అయినా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.

35
నీటిలో నానబెట్టాలి

వెల్లుల్లి పొట్టును ఈజీగా తీయాలనుకునే వారికి ఇది బెస్ట్ చిట్కా అనే చెప్పాలి. వెల్లుల్లి పొట్టు తీసేముందు వీటిని నీళ్లలో నానబెట్టండి. కొన్ని నిమిషాల తర్వాత బయటకు తీసి పొట్టు తీయండి. దీనివల్ల చాలా ఈజీగా పొట్టు వదిలిపోతుంది. వెల్లుల్లి మీ చేతులకు కూడా అంటుకోదు. ఈ చిట్కా వల్ల నిమిషాల్లో పొట్టును తీసేస్తారు.

మైక్రోవేవ్

మైక్రోవేవ్ సహాయంతో కూడా మీరు వెల్లుల్లి పొట్టును చాలా ఈజీగా తీసేయొచ్చు. ఇందుకోసం వీటిని ఒక గిన్నెలో వేసి 30 సెకన్ల పాటు వేడి చేయండి. మరీ ఎక్కువగా కాకుండా.. కొంత వేడెక్కిన తర్వాత వెల్లుల్లిని బయటకు తీయండి. ఇప్పుడు పొట్టును తీయండి. చాలా ఈజీగా పొట్టును తీయొచ్చు. వెల్లుల్లి మొత్తాన్ని ఒకదగ్గర వేసి రెండు చేతులతో నలిపినా పొట్టు ఈజీగా పోతుంది.

45
కత్తితో తీయొచ్చు

కూరగాయలు కట్ చేసే కత్తితో కూడా మీరు వెల్లుల్లి పొట్టును ఈజీగా వలచొచ్చు. దీనివల్ల మీరు వంటచేసే సమయం చాలా వరకు ఆదా అవుతుంది. వంట చేసేటప్పుడు వెల్లుల్లిని వేయాలనుకుంటే కత్తితో కట్ చేస్తే పొట్టు సులువుగా పోతుంది. ఇందుకోసం వెల్లుల్లి కొనను కట్ చేస్తే పొట్టు మొత్తాన్ని ఒకేసారి తీసేయొచ్చు.

పాన్ లో వేడిచేయడం

పాన్ లో వేడి చేసి కూడా మీరు వెల్లుల్లి పొట్టును సులువుగా తీయొచ్చు. ఇందుకోసం ఒక పాన్ వేడి చేసి అందులో కొద్ది సేపు వెల్లుల్లి రెబ్బలను వేయించండి. ఇవి చల్లారిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను చేతులతో రబ్ చేయండి. దీనివల్ల కేవలం రెండు నిమిషాల్లోనే ఇబ్బంది లేకుండా వెల్లుల్లి పొట్టును తీసేస్తారు.

55
వెల్లుల్లి ప్రయోజనాలు

వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ బి, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తపోటు స్థిరంగా ఉంటుంది.

 అలాగే బరువు తగ్గాలనుకునేవారికి కూడా వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ పచ్చి వెల్లుల్లి రెబ్బను తింటే ఫ్యాట్ కరిగి బరువు తగ్గుతారు. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లుల్లు వెల్లుల్లి పాలను తాగినా, వీటిని తిన్నా పాల ఉత్పత్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు

Read more Photos on
click me!

Recommended Stories