Periods:పీరియడ్స్ ప్రతి నెలా ఆలస్యం అవుతున్నాయా? ఇదే కారణం కావచ్చు

Published : Jul 16, 2025, 05:00 PM IST

పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు కూడా ఇలా పీరియడ్స్ లేటుగా రావడానికి కారణం. ఇవి కాకుండా.. మరి కొన్ని కారణాల వల్ల కూడా నెలసరి క్రమం తప్పుతుంది.

PREV
14
irregular periods

మహిళలను పీరియడ్స్ ప్రతి నెలా పలకరిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో పీరియడ్స్ వస్తూ ఉండొచ్చు. స్త్రీ బుతుచక్రం మీద ఇది ఆధారపడి ఉంటుంది. కానీ, కొందరు మహిళలు ఈ పీరియడ్స్ సక్రమంగా రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరికి రోజులు ఆలస్యం కావచ్చు.. మరి కొందరికి రెండు, మూడు నెలలు ఆలస్యం కావచ్చు. ఇలా ఆలస్యం అవ్వడం ఏదో ఒక అనారోగ్య సమస్యకు కారణం కావచ్చు. ముఖ్యంగా పీసీఓఎస్, పీసీఓడీ సమస్యలు కూడా ఇలా పీరియడ్స్ లేటుగా రావడానికి కారణం. ఇవి కాకుండా.. మరి కొన్ని కారణాల వల్ల కూడా నెలసరి క్రమం తప్పుతుంది. మరి, ఆ కారణాలు ఏంటో తెలుసుకుందామా...

24
అధిక ఒత్తిడి...

శరీరంలో ఒత్తిడి పెరిగినప్పుడు, అది హార్మోన్ స్థాయిలను కూడా ప్రభావితం చేస్తుంది. హార్మోన్ల ప్రభావం కారణంగా పీరియడ్స్ ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మహిళలు ఒత్తిడి కారణంగా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పిని అనుభవించవచ్చు. కాబట్టి ఒత్తిడి నుండి బయటపడటానికి ప్రయత్నించండి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా, ధ్యానం లేదా శ్వాస వ్యాయామాల ద్వారా ఒత్తిడిని సులభంగా నిర్వహించవచ్చు.

34
అకస్మాత్తుగా బరువు తగ్గడం..

అధికంగా లేదా అకస్మాత్తుగా బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. నిజానికి, బరువు తగ్గడానికి మీరు తీసుకునే కేలరీలను ఎక్కువగా తగ్గించినప్పుడు, అండోత్సర్గముకు అవసరమైన హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. ఇది మీ ఋతుస్రావాల క్రమబద్ధతను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ప్రయత్నించండి.

అధిక బరువు పెరగడం...

ఒకేసారి బరువు తగ్గినప్పుడు ఎలా అయితే పీరియడ్స్ ఆలస్యం అవుతాయో.. అధిక బరువు పెరిగినప్పుడు కూడా ఇలానే ఆలస్యం అవుతాయి.బరువు బాగా పెరిగినప్పుడు స్త్రీల శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా పెరుగుతుంది. దీని వల్ల బుతుచక్రం ప్రభావితం అవుతుంది. ఈ పీరియడ్స్ ఎప్పుడు వస్తాయో కూడా తెలీదు.

44
ఎక్కువగా వ్యాయామం చేయడం..

ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం చాలా అవసరం. కానీ వ్యాయామం అధికంగా చేస్తే, అది మీ ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అధిక వ్యాయామం మీ ఋతుస్రావానికి కారణమైన హార్మోన్లపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు తీవ్రమైన వ్యాయామాలు చేయడం ద్వారా అదనపు శరీర కొవ్వును తగ్గించడానికి ప్రయత్నించినప్పుడు, అండం విడుదల సరిగా జరగకపోవచ్చు.అప్పుడు కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి.

గర్భనిరోధక మాత్రలు తీసుకున్నప్పుడు...

కొంతమంది మహిళలు గర్భనిరోధక మాత్రలు తీసుకుంటారు. దీని వల్ల కూడా మీ బుతుక్రమం దెబ్బ తింటుంది. ఈ మందులు మీ హార్మోన్లను చాలా దెబ్బతీస్తాయి. కాబట్టి, ఇవి కూడా మీ పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం అవుతాయి. ఇలాంటప్పుడు.. మీరు భయపడకుండా, వైద్యులను సంప్రదించడం మంచిది. గర్భనిరోధక మాత్రలు వాడకుండా ఉండటం మరింత మంచిది.

తల్లిపాలు ఇవ్వడం

ప్రసవం తర్వాత తల్లిపాలు ఇస్తున్నప్పుడు కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి. దీనిని లాక్టేషనల్ అమెనోరియా అంటారు. కొన్ని నెలల తర్వాత, మీ పీరియడ్స్ సాధారణంగా తిరిగి రావడం ప్రారంభమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories