బనారస్ చీరలను ఆడవాళ్లు ఎంతో ఇష్టంగా కొంటుంటారు. కానీ అది అసలైన పట్టుచీరనో? కాదో? మాత్రం చాలా మందికి తెలియదు. బనారస్ పట్టు చీరలు స్వచ్ఛమైనవో కావో చెప్పడానికి దారం చూసే సరిపోతుంది. అవును ఒరిజినల్ పట్టుచీరలను స్వచ్ఛమైన మల్బరీ పట్టు దారంతో నేస్తారు. ఈ మల్బరీ పట్టు మెరుస్తూ, స్మూత్ గా ఉంటుంది. స్వచ్ఛమైన పట్టుకు దాని సహజమైన మెరుపు ఉంటుంది. ఇది నునుపుగా, మృదువుగా ఉంటుంది.
మీరు కొన్న పట్టు చీర ఒరిజినలో కాదో తెలుసుకోవడానికి చీర నుండి ఒక చిన్న దారాన్ని తీయండి. దీన్ని కాల్చితే జుట్టు కాలిన వాసన వస్తే అది స్వచ్ఛమైన పట్టు అని అర్థం చేసుకోండి. అదే ప్లాస్టిక్ కాలిన వాసన వస్తే కృత్రిమ పట్టు అని అర్థం చేసుకోండి.
మీరు పట్టు చీరను కొనాలనుకుంటే భారత ప్రభుత్వ సిల్క్ మార్క్ సర్టిఫికేట్ ఉన్న చీరలను కొనండి. ఇవి స్వచ్ఛమైన పట్టుచీరలు.