Viral Video: న‌లుగురూ ఉన్నార‌న్న బుద్ధి కూడా లేదా.? బ‌స్సులో స్కూలు పిల్ల‌ల రొమాన్స్

Published : Jun 03, 2025, 01:04 PM IST

Students romance in bus: స్వేచ్ఛ‌ను స‌రిగ్గా వినియోగించుకుంటేనే దానికి అర్థం ఉంటుంది. ప‌క్క‌వారికి ఇబ్బంది క‌లిగించేలా ఉంటే దానిని స‌మాజం అంగీక‌రించ‌దు. తాజాగా చోటు చేసుకున్న ఓ సంఘ‌ట‌న‌పై సోష‌ల్ మీడియాలో తీవ్ర వ్య‌తిరేక‌త వ‌స్తోంది.

PREV
14
బస్సులో స్కూల్ విద్యార్థుల రొమాన్స్ వీడియో వైరల్

సోష‌ల్‌ మీడియా వేదికగా ఓ వీడియో ప్రస్తుతం కలకలం రేపుతోంది. పబ్లిక్ ప్రదేశాల్లో వ్యక్తిగత స్వేచ్ఛను దుర్వినియోగం చేసినట్టుగా భావించే ఈ సంఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

టీనేజ్‌లో ప్రేమ అనే భావన ఎలా వేగంగా మారుతోంది, దాని ప్రభావం ఎలా ఉంటోంది అనే అంశంపై ఇది మరో ఉదాహరణగా నిలుస్తోంది.

24
స్కూల్ డ్రెస్‌లో బస్సులో కనిపించిన అసాధారణ దృశ్యం

వైరల్ వీడియో ప్రకారం, ఆర్టీసీ బస్సులో వెనుక భాగంలోని సీట్లలో స్కూల్ యూనిఫాం ధరించిన ఇద్ద‌రు టీన్స్ (అమ్మాయి, ఒక అబ్బాయి( కూర్చొని ఉన్నారు. చుట్టూ ప్రయాణికులు ఉన్నా, వారి ప్రవర్తనలో ఎలాంటి జంకు లేదు. 

ఇద్దరూ బహిరంగంగా హత్తుకుని, లిప్ లాక్ ముద్దుల్లో లీన‌మ‌య్యారు. దీనంత‌టినీ బ‌య‌ట ఉన్న ఓ వ్య‌క్తి ఫోన్‌లో రికార్డ్ చేసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.

34
తీవ్ర విమ‌ర్శ‌లు

ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టవ్వగానే నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో విరుచుకుప‌డుతున్నారు. న‌లుగురూ ఉన్నార‌న్న బుద్ధి కూడా లేదా అంటూ వారిపై మండిప‌డుతున్నారు. పబ్లిక్ స్పేస్‌లో ఇలాంటి ప్రవర్తన క్షమించరానిదని అంటున్నారు. 

అందులోనూ చిన్న పిల్ల‌లు ఇలాంటి ప‌ని చేయ‌డం స‌మాజంలో వేగంగా మారుతోన్న ప‌రిణామాల‌కు, సోష‌ల్ మీడియా దుష్ప్ర‌భావానికి నిద‌ర్శ‌నం అంటూ మ‌రికొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు.

44
అస‌లు ఏటు వెళ్తున్నాం.?

ఈ ఘటన చూస్తే యూత్‌లో పెరుగుతున్న బాధ్య‌తారాహిత్యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. టీనేజ్ వయసులో ప్రేమ సాధార‌ణ‌మే అయినా. మ‌రీ స్కూల్ డ్ర‌స్‌లో అది కూడా బస్సులో రొమాన్స్ చేయడం వంటివి సమాజంలో త‌గ్గుతోన్న విలువ‌ల‌ను ప్ర‌శ్నిస్తున్నాయి. దీనికి స‌మాజంలో వ‌స్తున్న మార్పులు, సోష‌ల్ మీడియా, సినిమాల ప్ర‌భావమే కార‌ణ‌మ‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

నెట్టింట వైర‌ల్ అవుతోన్న వీడియో ఇదే.

Read more Photos on
click me!

Recommended Stories