Viral News: చిలిపి చిలుక ఎంత పని చేసింది.. ఏకంగా అలెక్సాలో

టెక్నాలజీ రోజురోజుకీ పెరుగుతోంది. ఊహకందని విధంగా సాంకేతికత వృద్ధి చెందుతోంది. ఇంట్లో కూర్చొనే నచ్చిన వస్తువులను ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసుకునే రోజులు వచ్చేశాయ్‌. క్విక్‌ కామర్స్‌ రాకతో కేవలం 10 నిమిషాల్లోనే వస్తువులు ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇక వాయిస్‌ అసిస్టెంట్‌లు కూడా సరికొత్త టెక్నాలజీకి శ్రీకారం చుట్టాయి. అయితే టెక్నాలజీ మనుషులకు ఎంత మేలు చేస్తుందో అదే సమయంలో కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన ఓ సంఘటనకు సంబంధించిన వార్త తాజా మరోసారి వైరల్‌ అవుతోంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

African Grey Parrot Orders from Amazon Alexa Shocks Owner with Online Shopping Spree in telugu
Viral News

అలెక్సా.. టెక్‌ రంగంలో ఒక సంచలనం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వాయిస్‌ కమాండ్‌ ద్వారా నచ్చిన సేవలను పొందే అవకాశం అలెక్సాతో ఉంటుందని తెలిసిందే. ఒక నచ్చిన పాట ప్లే చేయడం మొదలు ఆన్‌లైన్‌లో వస్తువులను ఆర్డర్‌ చేసే వరకు అలెక్సాను ఉపయోగిస్తున్నారు. అయితే అలెక్సాను మనుషులకు బదులుగా పక్షులు ఉపయోగిస్తే ఎలా ఉంటుంది.? ఊహించుకోవడానికే వింతగా ఉన్నా ఈ సంఘటన నిజంగా జరిగింది. 

African Grey Parrot Orders from Amazon Alexa Shocks Owner with Online Shopping Spree in telugu

ఆఫ్రికన్‌ గ్రే ప్యారెట్‌ అచ్చంగా మనుషుల్లా మాట్లాడగలుగుతంది. ఇది మనుషుల వాయిస్‌ను అనుకరరిస్తుంది. ఈ జాతికి చెందిన రోక్కో అని ఓ చిలుక అలెక్సాలో ఏకంగా వస్తువులను ఆర్డర్‌ పెట్టేసింది. యజమాని అలెక్స్‌ను ఉపయోగించే విధానాన్ని గమనించిన రోక్కో.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అలెక్సాలో వస్తువులను ఆర్డర్‌ చేసింది. వాటర్‌మెలన్, ఎండుద్రాక్ష, బ్రోకలీ, ఐస్‌క్రీమ్లతోపాటు… ఒక లైట్ బల్బ్, కైట్ కూడా ఆర్డర్ చేసింది. 
 


ఈ విషయమై రోక్కో యజమాని అయిన మెరియన్ విశ్నెవ్స్కీ మాట్లాడుతూ.. 'ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చాక షాపింగ్‌ లిస్ట్‌ చేయగానే అందులో కొన్ని వస్తువులు ఆర్డర్‌ చేసినట్లు కనిపించాయి. నిజానికి వాటిని మేం ఆర్డర్‌ చేయలేదు. ఆ తర్వాత ఆ ఆర్డర్స్‌ను రోక్కో చేసినట్లు తెలిసింది. దీంతో వెంటనే ఆ ఆర్డర్లను రద్దు చేశాను' అని చెప్పుకొచ్చారు. అయితే రోక్కో ఇలా చేయడం ఇదే తొలిసారి కాదంటా గతంలో పలుసార్లు తన కొంటె పనులతో పరేషాన్‌ చేసిందని చెప్పుకొచ్చారు. 

Latest Videos

vuukle one pixel image
click me!