రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతినిధి అంటే మన భాషలో పుతిన్ పీఏ డిమిత్రి పెస్కోవ్ తన భార్య పుట్టినరోజు సందర్భంగా ఆమెకు వెరైటీగా శుభాకాంక్షలు చెప్పారు. ఎప్పుడూ అధ్యక్షుడి వ్యవహారాలు చూసుకుంటూ బిజీగా ఉండే ఆయన.. భార్యను సర్‌ప్రైజ్ చేసి అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Putin’s PA Dmitry Peskov’s Romantic Birthday Surprise for Wife Tatiana Navka
రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవహారాలు చూసుకునే వారు పుట్టినరోజు వేడుకలు సాదాసీదాగా ప్రైవేట్‌గా జరుపుకొంటుంటారు. కానీ పుతిన్ పీఏ పెస్కోవ్ మాత్రం అందుకు భిన్నంగా తన భార్య పుట్టినరోజుని చేశారు.పెస్కోవ్ భార్య స్వతహాగా ఒలింపిక్ పోటీల్లో పాల్గొన్న స్కేటర్.. ఆమె పేరు టట్యానా నవ్‌కా... రీసెంట్‌గా నవ్‌కా పుట్టినరోజు సందర్బంగా పెస్కోవ్ ఆమెతో కలిసి స్కేటింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా వేలాది మంది నడుమ 'అండ్ ఐ లైక్ హిమ్' అని కార్యక్రమాన్ని నిర్వహించారు పెస్కోవ్ మరియు నవ్‌కా.
Putin’s PA Dmitry Peskov’s Romantic Birthday Surprise for Wife Tatiana Navka
నవ్‌కా పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఇష్టమైన స్కేటింగ్ ఆడుతూ శుభాకాంక్షలు పెస్కోవ్ చెప్పాడు. దీని కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇక స్కేటింగ్‌కు ఉపయోగించే ఐస్ రింక్‌కు బదులు పోడియాన్ని తయారు చేసి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కేటింగ్ చేయడం అందరినీ ఆకట్టకుంది.
Putin’s PA Dmitry Peskov’s Romantic Birthday Surprise for Wife Tatiana Navka
ఇక స్కేటింగ్ ప్రదర్శన ముగిసిన తర్వాత, అతను తన భార్యకు అందమైన ఎర్ర గులాబీల పుష్పగుచ్ఛాన్ని అందించాడు. దీంతో వారి ప్రేమ కూడా ఆ పువ్వులు వలే పరిపూర్ణమైన ప్రేమ వికాసాన్ని జోడించింది. ఆ జంట కలిసి గ్లైడింగ్, డ్యాన్స్ చేస్తున్న వీడియోలు రష్యన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అయ్యాయి. చాలా మంది ఈ జంట కెమిస్ట్రీని చూసిన అందరూ పెస్కోవ్ ఉత్సాహాన్ని ప్రశంసించారు. రష్యాలో రాజకీయాల వల్ల గుర్తింపు పొందిన జంటగా పేరు తెచ్చుకున్న పెస్కోవ్, నవ్‌కా ఇలా రొమాంటిక్‌గా ఒకరిపై ఒకరు ప్రేమ చూపించుకోవడంతో భార్యభర్తల మధ్య ఉండే ఆప్యాయత, ప్రేమను తెలియజేసిందని ఈ దంపతుల వీడియో చూసిన పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.