Kitchen Tips: ప్లాస్టిక్‌ డబ్బాల్లో వీటిని అస్సలు పెట్టకూడదు.. చాలా ప్రమాదం!

Published : Jul 29, 2025, 04:43 PM IST

ప్లాస్టిక్ డబ్బాలను మనం ఇంట్లో రెగ్యులర్ గా వాడుతుంటాం. వాటిలో రకరకాల పదార్థాలు, వస్తువులను స్టోర్ చేస్తుంటాం. అయితే ప్లాస్టిక్ డబ్బాల్లో కొన్నింటిని అస్సలు పెట్టకూడదట. అవి ప్రమాదానికి దారి తీస్తాయట. మరి వేటిని పెట్టకూడదో ఇక్కడ చూద్దాం.  

PREV
15
Plastic Container Storage Mistakes

మనలో చాలామంది ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా వాడుతుంటారు. ధర తక్కువగా ఉంటుంది. అందంగా, తేలికగా ఉంటాయి కాబట్టి.. చాలామంది వీటిని కొనుగోలు చేస్తుంటారు. వీటిని ఆహార పదార్థాలు, ఇతర వస్తువులను నిల్వ చేయడానికి ఉపయోగిస్తుంటారు. అయితే కొన్ని వస్తువులను ప్లాస్టిక్ డబ్బాల్లో అస్సలు పెట్టకూడదట. ఎందుకో ఇక్కడ చూద్దాం.

25
వేడి పదార్థాలు

వేడి అన్నం, కూర, పప్పు, వేపుడు వంటివాటిని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టకూడదు. వేడి ఆహారం పెడితే ప్లాస్టిక్ వేడెక్కి ప్రమాదకర రసాయనాలు విడదలవుతాయి. అవి ఆహారంలో కలవడం వల్ల హార్మోన్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లో సమస్యలు వస్తాయి. అందుకే ప్లాస్టిక్ డబ్బాల్లో వేడి ఆహారం పెట్టకూడదు. కావాలంటే చల్లారిన తర్వాత పెట్టుకోవచ్చు.

35
ఆమ్ల ఆహారాలు

నిమ్మరసం, టమాటా సాస్ వంటి ఆమ్ల ఆహారాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేయకూడదు. అవి ప్లాస్టిక్‌తో చర్య జరిపి హాని కలిగిస్తాయి.

అధిక కొవ్వు పదార్థాలు:

నూనెలో వేయించినవి, వెన్న వంటి అధిక కొవ్వు పదార్థాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేస్తే అవి ప్లాస్టిక్‌తో చర్య జరుపుతాయి.

45
రసాయనాలను..

కొన్ని ఇళ్లల్లో మిగిలిన కిరోసిన్, పెట్రోల్, పెయింట్ లాంటి రసాయనాలను ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేస్తారు. కానీ అది ప్రమాదం. ఈ రసాయనాలు ప్లాస్టిక్‌ను కరిగించి, లీకేజీకి కారణమవుతాయి. దానివల్ల అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

పురుగుమందులు:

ప్లాస్టిక్ డబ్బాల్లో పురుగుమందుల వంటి వాటిని నిల్వ చేయకూడదు. అవి ప్లాస్టిక్‌తో చర్య జరిపి, డబ్బా బలహీనపడి, విషవాయువులు వెలువడతాయి. పిల్లలు, పెంపుడు జంతువులకు వీటిని దూరంగా ఉంచాలి.

55
పదునైన వస్తువులు

ప్లాస్టిక్ డబ్బాల్లో కత్తి, స్క్రూ, సుత్తి లాంటి పదునైన, బరువైన వస్తువులు పెట్టకూడదు. డబ్బా గీతలు పడుతుంది లేదా చిల్లులు పడతాయి. ఈ లోహాలు ప్లాస్టిక్‌తో రాపిడి చెంది, మైక్రోప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తాయి. కాబట్టి ఇలాంటి వస్తువులను ప్లాస్టిక్ డబ్బాల్లో కాకుండా, స్టీల్, టూల్ బాక్స్ లేదా చెక్క డబ్బాల్లో పెట్టాలి.

ఆల్కహాల్:

ప్లాస్టిక్ డబ్బాల్లో ఆల్కహాల్ నిల్వ చేయడం మంచిది కాదు. అవి ప్లాస్టిక్‌తో చర్య జరిపి విషపూరితం అవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories