Wines Bandh : దసరా పండగ పూట మందు, చికెన్ మటన్ తో విందు చేసుకోవాలని అనుకునేవారికి ఇవాళే లాస్ట్ ఛాన్స్. మిస్సయితే మీ పార్టీ ఆశలు ఆవిరి అవుతాయి. ఎందుకో తెలుసా?
Wines Bandh : తెలుగు ప్రజలు జరుపుకునే ప్రధాన పండగల్లో దసరా ఒకటి... తెలంగాణలో అయితే ఈ పండగను మరింత ఘనంగా జరుపుకుంటారు. వాడవాడలా దుర్గామాత విగ్రహాలను ప్రతిష్టించి నవరాత్రులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు... బతుకమ్మ పండక్కి ఆడపడుచులు సందడి చేస్తారు. ఇక దసరా పండగపూట ప్రతిఒక్కరు కొత్తబట్టలు ధరించి బంగారం (జమ్మి ఆకులు) పంచుకుంటూ ఆత్మీయ ఆలింగనాలు చేసుకుంటారు. ఇలా కుటుంబసభ్యులు, స్నేహితులు, తెలిసినవారితో కలిసి దసరా పండగపూట ఆనందంగా గడుపుతారు.
26
దసరా రోజు మందు, విందు పార్టీలు
ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల చదువులు, వ్యాపారాల పేరిట ఎక్కడెక్కడో నివాసముండే వాళ్ళంతా దసరా పండక్కి స్వస్థలాలకు చేరుకుంటారు. ఇలా ఒక్కచోటికి చేరిన కుటుంబసభ్యులు, స్నేహితులు మందు, విందు చేసుకోవడం సర్వసాధారణం. ఇక ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు సరిగ్గా దసరా ముందే షెడ్యూల్ విడుదలయ్యింది... త్వరలోనే నోటిఫికేషన్ కూడా వెలువడనుంది. కాబట్టి రాజకీయ పార్టీల నాయకులు, పోటీచేయాలనుకునే అభ్యర్థుల మందు పార్టీలు కూడా గట్టిగానే ఉంటాయి.
36
ఈ దసరా పార్టీకి ముందుజాగ్రత్త తప్పనిసరి
అయితే ఈ దసరాకు ఇలా మందు, విందు చేసుకోవాలనుకునేవారు ముందుగానే జాగ్రత్తపడాల్సి ఉంటుంది. ఎందుకంటే దసరా సరిగ్గా అక్టోబర్ 2న వస్తోంది... అంటే ఈరోజు పండగే కాదు దేశ జాతిపిత మహాత్మాగాందీ జయంతి కూడా ఉంది. గాందీ జయంతికి దేశవ్యాప్తంగా మద్యం విక్రయాలపై నిషేదం ఉంటుంది... కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కూడా వైన్స్, బార్లు మూతపడతాయి. ఇలా దసరా పండగరోజు మద్యపానం అమ్మకాలపై నిషేదం ఉంటుంది.. కాబట్టి ఎక్కడికి వెళ్లినా మద్యం దొరకదన్నమాట.
గాంధీ జయంతిరోజే దసరా పండగ రావడం మద్యం ప్రియులకే కాదు వైన్స్ యజమానులకు కూడా పెద్ద దెబ్బే అని చెప్పాలి. తెలంగాణలో నూతన వైన్ షాపుల ఏర్పాటుకు ప్రభుత్వ నోటిఫికేషన్ జారీ చేసింది... అంటే ప్రస్తుతం కొనసాగుతున్న వైన్స్ కాలపరిమితి త్వరలో ముగుస్తుంది. కాబట్టి చివరగా ఈ దసరా పండగ సమయంలో వీలైనంత ఎక్కువ అమ్మకాలు జరపాలని వైన్ షాప్ యజమానులు భావించారు. కానీ గాంధీ జయంతి వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో పండక్కి ముందే మద్యం విక్రయాలను పెంచేందుకు కొన్ని వైన్స్ లు ఆఫర్లు పెడుతున్నాయి... ప్లెక్సీలు ఏర్పాటుచేసిమరీ దీనిపై ప్రచారం చేసుకుంటున్నారు.
56
జోరందుకున్న మద్యం విక్రయాలు
వినియోగదారులు కూడా దసరా రోజు మందుపార్టీ చేసుకునేందుకు సిద్దమైనవారు ముందుగానే స్టాక్ సమకూర్చుకుంటున్నారు... దీంతో వైన్స్ ల వద్ద రద్దీ పెరిగింది. ఇవాళ (సెప్టెంబర్ 1, బుధవారం) రాత్రి వరకు తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగే అవకాశాలున్నాయి. దసరా పండక్కి స్థానికసంస్థల ఎన్నికలు కలిసిరావడంతో ఈసారి గతంలో కంటే ఎక్కువగా మద్యం విక్రయాలు ఉంటాయని ఎక్సైజ్ అధికారులు కూడా భావిస్తున్నారు.
66
హైదరాబాద్ లో దసరాకి చుక్కా ముక్కా బంద్
రాజధాని హైదరాబాద్ లో దసరా పండక్కి పార్టీ చేసుకోవాలని అనుకునేవారి పరిస్ధితి మరింత గందరగోళంగా ఉంది. జిహెచ్ఎంసి పరిధిలో కేవలం మద్యం విక్రయాలే కాదు మాంసం అమ్మకాలు కూడా అక్టోబర్ 2 బంద్. కాబట్టి నగరంలో ఇవాళే(బుధవారం) దసరా సందడి నెలకొంది. మద్యం కోసం వైన్స్ లు, మాంసం కోసం చికెట్, మటన్ షాపుల ముందు క్యూలైన్లు కనిపిస్తున్నాయి. గత రెండుమూడు రోజులుగా మద్యం అమ్మకాలు పెరిగినట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి.