Azim Premji Scholarship : తెలుగమ్మాయిలకు బంపరాఫర్ ... ఫ్రీగా రూ.30,000 ఆర్థికసాయం, ఎలా పొందాలో తెలుసా?

Published : Sep 30, 2025, 09:55 AM IST

Azim Premji Scholarship : టెక్ దిగ్గజం విప్రో ఆధ్వర్యంలో నడిచే అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఉన్నత విద్యాభ్యాసం చేసే తెలుగమ్మాయిలకు బంపరాఫర్ ఇస్తోంది. ఫ్రీగా రూ.30000 అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

PREV
16
తెలుగమ్మాయిలకు అద్భుత అవకాశం

Azim Premji Scholarship : అజీమ్ ప్రేమ్‌జీ... మంచి వ్యాపారవేత్త మాత్రమే కాదు గొప్ప మనసున్న వ్యక్తి. భారతీయ టెక్ దిగ్గజం విప్రో లిమిటెడ్ ఛైర్మన్ గా 80 ఏళ్ల వయసులోనూ బిజీబిజీగా గడిపే ఈయన 2001 నుండి అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా గత రెండు దశాబ్దాలుగా ఆయన సంపాదనలో అధికబాగాన్ని ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు... ఇందులో భాగంగానే నిరుపేద అమ్మాయిల చదువుకోసం ఈ ఫౌండేషన్ స్కాలర్ షిప్స్ అందిస్తున్నారు.

26
చదువుతోనే అమ్మాయిల జీవితంలో మార్పు

అమ్మాయిలు చదువుకుంటేనే మగవారిపై ఆధారపడకుండా స్వతంత్రంగా బ్రతకవచ్చు... ఇది వారి భవిష్యత్తునే కాదు దేశ భవిష్యత్తును కూడా నిర్దేశిస్తుంది. ఇది గుర్తించిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ ఆర్థిక ఇబ్బందులతో ఉన్నత చదువులకు దూరమయ్యే నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సాయం చేస్తోంది. ఆర్థికంగా వెనుకబడి, ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థినుల కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్‌షిప్ అందిస్తోంది.

36
అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్

అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేవలం అమ్మాయిలే అర్హులు. వీళ్లు ఆర్థికంగా వెనుకబడిన వర్గానికి చెందినవారై ఉండాలి. టెన్త్ లేదా ఇంటర్మీడియట్ పూర్తిచేసివుండాలి... డిగ్రీ/డిప్లొమా మొదటి సంవత్సరంలో చేరి ఉండాలి.

46
తెలుగు అమ్మాయిలకు ఎంత డబ్బు ఇస్తారు?

ఎంపికైన ప్రతి విద్యార్థినికి ఏటా రూ.30,000 స్కాలర్‌షిప్ అందిస్తారు… ఈ డబ్బు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. రెండు విడతల్లో రూ.15,000 చొప్పున బ్యాంక్ అకౌంట్లో జమచేస్తారు. ఈ డబ్బును ఫీజులు, పుస్తకాలు, హాస్టల్ ఖర్చులకు వాడుకోవచ్చు. ఇది వారి చదువుపై దృష్టి పెట్టడానికి సాయపడుతుంది. ఈ స్కాలర్ షిప్ ను ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి.

56
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

అర్హులైన విద్యార్థినులు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక వెబ్‌సైట్ azimpremjifoundation.org లో 'Education' విభాగానికి వెళ్లి, అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేసి వివరాలు నింపాలి. దరఖాస్తు చేసే ముందు పాస్‌పోర్ట్ ఫోటో, సంతకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ పాస్‌బుక్, 10, 12వ తరగతి మార్కుల షీట్లు, కాలేజీ అడ్మిషన్ ప్రూఫ్ స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. 

చివరి తేదీ: సెప్టెంబర్ 30.

66
వయోపరిమితి లేదు

అర్హులైన తెలుగు విద్యార్థినులకు ఇది ఒక సువర్ణావకాశం. సెప్టెంబర్ 30 లోపు అంటే ఇవాళే చివరితేదీ… కాబట్టి వెంటనే దరఖాస్తు చేసుకొని, మీ ఉన్నత విద్యకు ఆర్థిక సహాయం పొందండి. ఈ స్కాలర్ షిప్స్ పొందేందుకు వయో పరిమితి లేదు... రెగ్యులర్ గా డిగ్రీ చదివే ఏ వయసు అమ్మాయిలైనా అర్హులే.

Read more Photos on
click me!

Recommended Stories