Garikapati Gurajada : గరికపాటి నరసింహరావు గుడ్డు వివాదం.. అసలు ఈయన కొడుకు ఏం చేస్తారో తెలుసా..?

Published : Mar 24, 2026, 03:50 PM IST

పాాఠశాలల్లో విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడంపై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. ఇలా పేరెంటింగ్, టీచింగ్ పై గరికపాటి వ్యాఖ్యల నేపథ్యంలో అసలు ఆయన తనయుడు ఏం చేస్తారో తెలుసుకుందాం.  

PREV
15
గరికపాటి నరసింహారావు పిల్లలు ఏం చేస్తారు..?

Garikapati Narasimha Rao : పొద్దున లేవగానే తెలుగువారికి ఓ ఇద్దరి ప్రవచనాలు ప్రధానంగా వినిపిస్తుంటాయి. ఇందులో ఒకరు చాగంటి కోటేశ్వరరావు కాగా మరొకరు గరికపాటి నరసింహరావు. ఈ ఇద్దరూ పిల్లలను ఎలా పెంచాలి అనేదానిపై ప్రధానంగా సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ఈ క్రమంలో వీరు పిల్లలను ఎలా పెంచారు..? వాళ్లు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఈ క్రమంలో గరికపాటి నరసింహారావు కొడుకుల గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

25
ఎవరీ గరికపాటి గురజాడ..?

గరికపాటి నరసింహారావు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం సమీపంలోని బోడపాడు అగ్రహారంలో జన్మించారు. ఆయన కాకినాడకు చెందిన శారదను పెళ్లాడారు. వీరికి ఇద్దరు మగపిల్లలు సంతానం. తనకు ఇష్టమైన సంఘసంస్కర్తలు, రచయితలు శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు), గురజాడ అప్పారావు పేర్లనే ఇద్దరు పిల్లలకు పెట్టుకున్నారు గరికపాటి.

అయితే నరసింహరావు చిన్నబ్బాయి గరికపాటి గురజాడ తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నారు. ఈయనకూడా తండ్రిలాగే తెలుగుపై పట్టు సాధించారు... తెలుగు సబ్జెక్ట్ పై ఎం.ఎ, ఎం.ఫిల్, పి.హెచ్.డి పూర్తిచేశారు. తండ్రినే గురువుగా స్వీకరించి కేవలం 23 ఏళ్ల వయసులోనే గురజాడ ప్రవచన రంగంలో ప్రవేశించారు.

ప్రవచన రంగంలో తండ్రికి తనయుడిగా గుర్తింపుపొందారు గురజాడ. చలోక్తులతో సరదాగా ప్రసంగిస్తూ ప్రజలను ఆకట్టుకుంటారు… ఏ టాపిక్ పై అయినా సీరియస్ గానూ మాట్లాడటంలో నేర్పరి. మనుచరిత్ర, కాశీఖండం వంటి కఠిన ప్రవచనాలతో పాటు రామాయణం, శ్రీమద్భాగవతం వంటి గ్రంథాల్లోని అంశాలతో ప్రవచనాలు చెబుతుంటారు. చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పడంలో తనవంతు పాత్రగా పాఠశాలల్లో వ్యక్తిత్వ వికాస ప్రసంగాలు కూడా చేస్తుంటారు.

35
గరకపాటి గురజాడ అవార్డులు...

గరికపాటి గురజాడ ''ఆంధ్ర మహాభారతం - సామాజికాంశాల పరిశీలన (ఆదిపర్వం నుండి విరాటపర్వం వరకు)'' అనే అంశంపై పి.హెచ్.డి పూర్తిచేశారు. ఇది జాతీయ స్థాయిలో అత్యుత్తమ పరిశోధనగా నిలిచింది. దీంతో కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ చేతులమీదుగా 2022 కె. కామేశ్వరీదేవీ స్మారక స్వర్ణ పతకాన్ని పొందారు.

ఐ. ఎం. ఏ తెలుగు అయిదేళ్ల (2009- 14) కోర్సులో ప్రథమ స్థానం సాధించినందుకు ఆనాటి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా స్వర్ణ పతకాన్ని పొందారు గరికపాటి గురజాడ. అలాగే జవహర్ లాల్ నెహ్రూ మెమోరియల్ ఫండ్ నుండి ప్రతిభాపురస్కారం కూడా పొందారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఐ. ఎం. ఏ తెలుగు సెమిస్టర్ పరీక్షలో ప్రథమ స్థానం సాధించినందుకు అప్పటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దువ్వూరి సుబ్బారావుగారి చేతుల మీదుగా మరోసారి ప్రతిభాపురస్కారం పొందారు. భారత రాష్ట్రపతి శ్రీ ఏ.పి. జే. అబ్దుల కలాం గారి చేతుల మీదుగా ప్రతిభాపురస్కారం పొందారు గరికపాటి గురజాడ.

45
గరికపాటి నరసింహరావు వ్యక్తిగత జీవితం...

ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తుంటారు గరికపాటి నరసింహారావు. ఆయన 1958, సెప్టెంబర్ 14న పశ్చిమ గోదావరి జిల్లాలో పెంటపాడు అగ్రహారంలో నివాసముండే వేంకట సూర్యనారాయణ, వేంకట రమణమ్మ దంపతులకు జన్మించారు. తెలుగులో ఎం.ఏ, ఎం.ఫిల్, పి.హెచ్.డి పూర్తిచేసిన ఆయన 30 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా పనిచేశారు.

అయితే తెలుగు గ్రంథాలు, ఆధ్యాత్మిక అంశాలపై మంచి పట్టు సాధించిన ఆయన 1978 జూలై 23న మొదటిసారి ప్రవచనం చేశారు. వరంగల్ జిల్లా నర్సంపేట నుండి ఆయన ప్రవచనాలు మొదలయ్యాయి. ఆ తర్వాత అవధానాలు కూడా చేశారు... ఇప్పటివరకు 325కు పైగా అష్టావదానాలు, 10 శతావధానాలు చేశారు. ఆయన ప్రవచనాలకు తెలుగు రాష్ట్రాల్లో లక్షలాదిమంది అభిమానులు ఉన్నారు.

55
విద్యారంగంపై గరికపాటి వివాదాస్పద వ్యాఖ్యలు..

అయితే గరికపాటి నరసింహారావు వ్యవహారతీరు కొన్నిసార్లు వివాదాలకు దారితీస్తోంది. గతంలో చిరంజీవిపై ఆయన చేసిన కామెంట్స్, ఇటీవల నా అన్వేషణపై కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్న భోజన పథకంపై కూడా కామెంట్స్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు గుడ్లు పెట్టడం, వాటిని పర్యవేక్షించే బాధ్యత ఉపాధ్యాయులకు అప్పగించడం ఏంటని గరికపాటి ప్రశ్నించారు.

Read more Photos on
click me!

Recommended Stories