హైదరాబాద్ చుట్టుపక్కల మీకు ఎక్కడ ఇల్లున్నా పర్లేదు.. మీరు బిందాస్. మారనున్న నగరం రూపురేఖలు.

Published : Mar 24, 2026, 07:34 AM IST

Hyderabad: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ముఖ్యంగా నగర శివారు ప్రాంతాల నుంచి సిటీ సెంటర్‌కు వచ్చే వారికి గంటల కొద్దీ ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

PREV
15
నగర విస్తరణకు కొత్త ప్రణాళిక

హైదరాబాద్ అభివృద్ధిని మరింత వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నగరాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ, పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ అనే రెండు ప్రధాన ఆర్థిక మండలాలుగా అభివృద్ధి చేయాలనే దిశగా ముందుకెళ్తోంది. ఈ రెండు ప్రాంతాల మధ్య రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా కొత్త రోడ్డు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓఆర్ఆర్‌, నిర్మాణంలో ఉన్న RRR మధ్య కనెక్టివిటీ పెంచడం వల్ల నగర విస్తరణ మరింత వేగంగా జరిగే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు, మిస్సింగ్ లింక్ రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు.

25
నగరంలో నిర్మాణం కానున్న 3 ఎలివేటెడ్ కారిడార్లు

ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు నగరంలో మూడు ప్రధాన ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించనున్నారు.

పారడైజ్ – డెయిరీ ఫామ్ రోడ్డు కారిడార్

ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా పారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫామ్ రోడ్డు వరకు సుమారు 5.40 కిలోమీటర్ల పొడవుతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. దాదాపు రూ. 1,478 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. అలాగే ఇందులో 500 మీటర్ల అండర్ పాస్ కూడా ఏర్పాటు చేయనున్నారు. పార‌డైజ్ నుంచి డెయిరీ ఫామ్ కేవ‌లం 5 కిలోమీట‌ర్లు మాత్ర‌మే ఉన్నా దాదాపు 30 నుంచి 40 నిమిషాల స‌మ‌యం ప‌డుతుంది. అయితే ఈ కారిడార్ అందుబాటులోకి వ‌స్తే కేవ‌లం 5 నుంచి 10 నిమిషాల్లోనే వెళ్లిపోవ‌చ్చు. కాగా ఇప్ప‌టికే డెయిర్ ఫామ్ నుంచి కొంప‌ల్లి వ‌ర‌కు మ‌రో ఫ్లైఓవ‌ర్ నిర్మాణం జ‌రుగుతోంది. దీంతో సిటీ కోర్ అయిన ప్యార‌డైజ్ నుంచి శివారు ప్రాంత‌మైన మేడ్చ‌ల్‌కు ప్ర‌యాణ స‌మ‌యం గ‌ణ‌నీయంగా త‌గ్గ‌నుంది.

పారడైజ్ – శామీర్‌పేట్ ORR కారిడార్

రెండో ప్రాజెక్ట్‌గా పారడైజ్ నుంచి శామీర్‌పేట్ ORR వరకు 18.18 కిలోమీటర్ల పొడవుతో భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. దాదాపు రూ. 4,263 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ అమలు కానుంది. ఇది నగర ఉత్తర భాగంలో ట్రాఫిక్‌ను భారీగా తగ్గించే అవకాశం ఉంది. ప్ర‌భుత్వం దీనికి స‌మాంత‌రంగా మెట్రోను కూడా అభివృద్ధి చేసే ఆలోచ‌న‌తో ఉండ‌డంతో భ‌విష్య‌త్తులో శామీర్‌పేట ముఖ‌చిత్రం మార‌డం ఖాయ‌మనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

కమాండ్ కంట్రోల్ సెంటర్ – గచ్చిబౌలి కారిడార్

మూడో ప్రాజెక్ట్‌గా బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి గచ్చిబౌలి శిల్పా లేఅవుట్ వరకు 9 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారు. సుమారు రూ. 1,656 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టనున్నారు. ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు ఇది పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.

35
ORR – RRR మధ్య రెండు రేడియల్ రోడ్లు

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మరో రెండు ముఖ్యమైన గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్లు కూడా నిర్మించనున్నారు. ORR రావిర్యాల నుంచి RRR ఆమన్‌గల్ వరకు సుమారు 41.5 కిలోమీటర్ల రేడియల్ రోడ్ ORR బుద్వేల్ నుంచి నాచారం – నేషనల్ హైవే 167 వరకు మరో రేడియల్ రోడ్ నిర్మించ‌నున్నారు. ఈ రోడ్లు పూర్తైతే ORR, RRR మధ్య ప్రయాణం మరింత వేగంగా సాగుతుంది.

45
రింగ్ రోడ్ ప్రాంతాలకు భారీ కనెక్టివిటీ

ఈ కొత్త రోడ్డు ప్రాజెక్టుల వల్ల ORR, RRR పరిసర ప్రాంతాలకు నగర కేంద్రంతో నేరుగా కనెక్టివిటీ పెరుగుతుంది. ఇప్పటివరకు నగర శివారు నుంచి సిటీకి రావడానికి ఎక్కువ సమయం పడుతుండేది. కానీ ఈ ఎలివేటెడ్ కారిడార్లు నిర్మాణం పూర్తైతే రింగ్ రోడ్ ప్రాంతాల్లో నివసించే వారు కూడా తక్కువ సమయంలోనే కోర్ సిటీకి చేరుకునే అవకాశం ఉంటుంది. ఇది ఉద్యోగులు, వ్యాపారులు, ఐటీ రంగంలో పనిచేసే వారికి పెద్ద సౌలభ్యంగా మారనుంది.

55
శామీర్‌పేట్, మేడ్చల్ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్

ఈ ప్రాజెక్టుల ప్రభావం ట్రాఫిక్ వరకు మాత్రమే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్ రంగంపైనా పెద్ద మార్పు తీసుకురానుంది. ప్రత్యేకంగా శామీర్‌పేట్, మేడ్చల్ చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో భూముల డిమాండ్ భారీగా పెరిగే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కనెక్టివిటీ పెరగడంతో శివారు ప్రాంతాల్లో నివాస ప్రాజెక్టులు, విల్లా ప్రాజెక్టులు, గేటెడ్ కమ్యూనిటీల అభివృద్ధి వేగంగా పెరిగే అవకాశం ఉంది. మొత్తానికి ఈ కొత్త ఎలివేటెడ్ కారిడార్లు, రేడియల్ రోడ్లు హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు పరిష్కారం చూపడమే కాకుండా నగర శివారు ప్రాంతాల అభివృద్ధికి కూడా గేమ్ ఛేంజర్‌గా మారనున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories