Vegetables Price : ప్రస్తుతం కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాకాలం ముగిసినా తెలుగు రాష్ట్రాల్లో వానలు కొనసాగుతున్నాయి... దీంతో కూరగాయల సాగు కష్టతరంగా మారింది. వర్షాలకు పంటలు దెబ్బతిని కూరగాయల దిగుబడి తగ్గింది… ఆటోమెటిగ్గా మార్కెట్ లో డిమాండ్ పెరిగి ధరలు కొండెక్కాయి. ఏ కూరగాయ ధర చూసినా కిలో రూ.50 కి అటుఇటుగా ఉంది.
సాధారణంగా ఉద్యోగులు, గృహిణిలకు వీకెండ్ లోనే కూరగాయలు కొనేందుకు సమయం దొరుకుతుంది. అందుకే హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో శుక్ర, శని, ఆదివారం మూడ్రోజులు ఎక్కువగా కూరగాయల సంతలు జరుగుతుంటాయి. మీరు కూడా ఇలా ఈ వీకెండ్ లో మార్కెట్ కు వెళుతున్నారా..? అయితే ముందుగా ఏ కూరగాయ ధర ఎంతుందో తెలుసుకొండి. దీనివల్ల సరైన ధరకు కూరగాయలు కొనుగోలు చేసే వీలుంటుంది... డబ్బులు ఆదా అవుతాయి.